ETV Bharat / state

మూడు భాగాలుగా స్మార్ట్‌ మీటర్ల టెండర్లు పిలవాలని డిస్కంల నిర్ణయం

Smart Meters Tenders In AP: రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు 6,480 కోట్లతో స్మార్ట్‌ మీటర్లు చేయాలన్న టెండరు ప్రకటనపై విమర్శలతో ప్రభుత్వ సూచన మేరకు డిస్కంలు ఈ పనుల్ని మూడు భాగాలుగా విభజించాయి. ఇప్పటికే అనుబంధ పరికరాల కొనుగోలుకు ఈ నెల 22న టెండర్ ప్రకటన జారీ చేశాయి. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు వెచ్చించే మొత్తం భారీగా కనిపించకుండా విభాగాల వారీగా టెండర్లు పిలుస్తోందన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

స్మార్ట్‌ మీటర్లు
Smart Meters
author img

By

Published : Dec 28, 2022, 10:06 AM IST

Smart Meters Tenders In AP: రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌ మీటర్లకు 6,480కోట్లతో స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసే ప్రయత్నం ఆఖరి క్షణంలో విఫలమైన నేపథ్యంలో మూడు భాగాలుగా ఈ టెండర్లు పిలవాలని డిస్కంలు నిర్ణయించాయి. మీటర్లు వాటికి అనుబంధ పరికరాల కొనుగోలుకు గతంలో ఒకే టెండర్‌ పిలిచిన డిస్కంలు నిర్ణయాన్ని మార్చుకొని వేర్వేరుగా బిడ్లు ఆహ్వానించాయి. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు నిధులు భారీగా వెచ్చించినట్లు కనిపించకుండా ఇలా విడగొట్టినట్లు తెలుస్తోంది. ఈ మూడు టెండర్ల విలువ సుమారు 5,600కోట్లు ఉంటుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

12,300 రూపాయల చొప్పున వెచ్చించాలని డిస్కంలు నిర్ణయం

మూడు డిస్కంల పరిధిలో 17.59 లక్షల స్మార్ట్‌ మీటర్ల అనుబంధ పరికరాల కొనుగోలుకు 2,163.11కోట్లతో ఈనెల22న టెండర్‌ ప్రకటన ఇచ్చారు. పూర్తి వ్యయాన్ని గుత్తేదారే భరించేలా క్యాపెక్స్‌ విధానంలో ఇవి కొనాలని నిబంధనల్లో చేర్చారు. 2023 జనవరి 11లోగా బిడ్‌ దాఖలుకు తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ-ఈపీడీసీఎల్, కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ-సీపీడీసీఎల్ తుది గడువు నిర్దేశించగా దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ-ఎస్ పీడీసీఎల్ మాత్రం 13వరకు అవకాశం ఇచ్చింది. గతంలో మీటర్ల కొనుగోలు, నిర్వహణ, అనుబంధ పరికరాల సరఫరాకు 6,480 కోట్లతో ఒకే టెండరును ప్రభుత్వం జారీ చేసింది.

ఒక్కో మీటరుకు సుమారు 35 వేలు ఖర్చు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు రావడంతో ఆ టెండర్‌ను రద్దు చేశారు. ధరను కాస్త తగ్గించి మళ్లీ టెండర్లు పిలిచారు. దీని ప్రకారం ఒక్కో మీటర్‌కు, అవసరమైన అనుబంధ పరికరాల కోసం 12,300 చొప్పున వెచ్చించాలని డిస్కంలు నిర్ణయించాయి. మీటర్ల కొనుగోలు, వాటి నిర్వహణకు సంబంధించిన టెండర్లను త్వరలో జారీ చేయనున్నట్లు సమాచారం. మూడు డిస్కంలు వేర్వేరు టెండర్లను ఇప్పటికే జారీచేశాయి.

గతంలో ఒకేరకమైన పనికి డిస్కంలు వేర్వేరు ధరలను ప్రతిపాదించడంపై విమర్శలు రావడంతో ఈసారి మాత్రం అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒకే ధర ఉండేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఎస్ పీడీసీఎల్ 11 లక్షల మీటర్ల కొనుగోలుకు 1,353 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. సీపీడీసీఎల్ 4 లక్షల మీటర్లకు అవసరమైన అనుబంధ పరికరాల కోసం 492.08 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈపీడీసీఎల్ 2,58,587 మీటర్లకు అనుబంధ పరికరాల కోసం 318.08 కోట్లతో టెండరు ప్రకటన జారీచేసింది.

ఇవీ చదవండీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.