ETV Bharat / state

Second Day Document Writers Protest: రిజిస్ట్రేషన్లలో కొత్త విధానం.. దస్తావేజు లేఖర్ల ఆందోళన

Second Day Document Writers Protest: రిజిస్ట్రేషన్‌ శాఖలో ప్రైమ్‌ 2.0 విధానంపై దస్తావేజు లేఖర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ... రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు వెండర్స్‌, దస్తావేజు లేఖర్లు పెన్‌డౌన్‌ నిర్వహించారు. కార్డుప్రైమ్‌ 2.0 విధానంపై అన్ని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతుల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌ విధానంతో అక్రమాలు పెరిగే అవకాశం ఉందని లేఖర్లు అభిప్రాయపడ్డారు. దస్తావేజు లేఖర్ల ఆందోళనలతో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు సాగని పరిస్థితి నెలకొంది.

Document Writers Protest on the Second day

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2023, 8:48 PM IST

Second Day Document Writers Protest: రిజిస్ట్రేషన్లలో కొత్త విధానం.. దస్తావేజు లేఖర్ల ఆందోళన

Second Day Document Writers Protest: రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్తగా ప్రారంభం కానున్న కార్డు ప్రైమ్ 2.0 విధానాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు రెండో రోజు ఆందోళన బాట పట్టారు. సబ్ రిజిస్టార్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించారు. దీంతో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. నూతన విధానంతో దస్తావేజు లేఖర్లు ఉపాధి కోల్పోవటంతో పాటు డిజిటల్ సంతకాలతో ‌అక్రమాలు జరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Stamp Vendors Pendown: ఈ-స్టాంప్‌ విధానాన్ని నిరసిస్తూ: ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన కార్డు ప్రైమ్‌ 2.0 విధానాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ దస్తావేజుల లేఖర్లు, స్టాంపు వెండర్లు పెన్ డౌన్ నిర్వహించారు. ఈ-స్టాంప్‌ విధానాన్ని నిరసిస్తూ... కోనసీమ ముమ్మిడివరం ధర్నా చేపట్టారు. నూతన విధానంపై సిబ్బందితో పాటు ప్రజలకు సరైన అవగాహన లేక సమస్యలు తలెత్తుతాయన్నారు. ప్రభుత్వం పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ... పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దస్తావేజు లేఖర్లు గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. నూతన విధానంతో దుష్ప్రయోజనాలే ఎక్కువని... దీనిపై మరోమారు పునరాలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Document Writers Agitation at Sub-Registrar Office: కార్డు ప్రైమ్‌ 2.0 నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.. డాక్యుమెంట్​ రైటర్ల ఆందోళన

రెండో రోజు పెన్ డౌన్: కార్డు ప్రైమ్ 2.0ని నిలిపివేయకుంటే తామంతా రోడ్డున పడతామని దస్తావేజు లేఖర్లు చీరాలలో ఆందోళన నిర్వహించారు. కార్డు ప్రైమ్ తో అసలు దస్త్రాలు రాక, నకలు పత్రాలతో భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాకినాడలో దస్తావేజు లేఖరులు, సహాయకులు, స్టాంపు వెండర్లు సహాయ నిరాకరణ చేస్తూ... రెండో రోజు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు.ప్రభుత్వం కొత్త విధానాలతో 20 ఏళ్లుగా పనిచేస్తున్న తమను ఇబ్బందులకు గురి చేస్తోందని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే కార్డు ప్రైమ్‌ 2.0 విధానాన్ని నిలిపివేయాలని... ప్రజలు కూడా ఈ విధానాన్ని ఆమోదించే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిజిటల్‌ సంతకాలతో రియల్‌ ఎస్టేట్‌ అక్రమాలు: రిజిస్ర్టేషన్‌ శాఖలో ప్రైమ్‌ 2.0 విధానానికి వ్యతిరేకంగా నెల్లూరు రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖర్లు సంక్షేమ సంఘం నిరసన వ్యక్తం చేసింది. ప్రైమ్ కార్డ్ 2.0 విధానంతో ప్రజల ఆస్తి పత్రాలకు భద్రత కరవుతుందని దస్తావేజు లేఖరులు ఆవేదన వ్యక్తం చేశారు. 1999లో ప్రవేశ పెట్టిన కార్డు ప్రైమ్‌ పాత విధానాన్నే కొనసాగించాలని కర్నూలులో దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్స్ ధర్నా చేశారు. డిజిటల్‌ సంతకాలతో రియల్‌ ఎస్టేట్‌ అక్రమాలు, పెద్ద ఎత్తున నకిలీ డాక్యుమెంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Minister Dharmana: రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు: ధర్మాన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.