ETV Bharat / state

గళమెత్తిన సమగ్రశిక్షా అభియాన్‌ ఉద్యోగులు - ఇచ్చిన హామీలు నేరవేర్చాలంటూ డిమాండ్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2023, 9:00 PM IST

Samagra Shiksha Abhiyan Employees Chalo Vijayawada Program: తమ సమస్యలు పరిష్కరించాలంటూ సమగ్రశిక్షా అభియాన్‌ ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. గత 4 నెలలుగా జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వశిక్ష విభాగంలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్న తమ చేత హమాలీలు చెయ్యాల్సిన పనిని సైతం చెయ్యిస్తున్నారని మండిపడ్డారు.

Samagra Shiksha Abhiyan Employees
Samagra Shiksha Abhiyan Employees
గళమెత్తిన సమగ్రశిక్షా అభియాన్‌ ఉద్యోగులు - ఇచ్చిన హామీలు నేరవేర్చాలంటూ డిమాండ్

Samagra Shiksha abhiyan Employees Chalo Vijayawada Program: చలో విజయవాడ పేరుతో సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు గళమెత్తారు. చాలీచాలని వేతనాలతో కుటుంబ భారం కష్టంగా మారిందని వాపోయారు. 4 నెలలుగా జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. పార్ట్ టైమ్ ఉద్యోగుల పేరుతో తమతో చాకిరి చెయ్యిస్తున్నారని సమగ్ర శిక్షా ఉద్యోగులు వాపోయారు. కడుపు మండిన ఉద్యోగులు, తమ సమస్యలు పరిష్కరించాలని చలో విజయవాడ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

సీఎం జగన్ మాటిచ్చి మోసం చేశారు: విద్యాశాఖ పరిధిలోని సమగ్రశిక్షా అభియాన్‌లో, సుమారు 26వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉపాధ్యాయులుగా, అకౌంటెంట్లుగా, రికార్డు అసిస్టెంట్లుగా ఇలా సుమారు 20 విభాగాల్లో పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు కనీస వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని సమగ్రశిక్షా అభియాన్‌ ఉద్యోగులు ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు సీఎం జగన్ మాటిచ్చి మోసం చేశారని, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చే అరకొర వేతనాలనూ సమయానికి చెల్లించడం లేదని మండిపడ్డారు.

4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఇలా అయితే, తాము ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే, పిల్లల చదువులు, ఇతర ఖర్చులు కష్టంగా మారిందని ఉద్యోగులు వాపోయారు. జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం తమని రెగ్యులర్ చేయాలని డిమాండ్‌ చేశారు.

నవతరానికి నాణ్యమైన విద్య అందేనా?

పీడీఎఫ్ ఎమ్మెల్సీల మద్దతు:మగ్రశిక్ష ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు వారికి అండగా ఉంటామన్నారు. సర్వశిక్షా విభాగంలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్న తమ చేత హమాలీలు చెయ్యాల్సిన పనిని సైతం చెయ్యిస్తున్నారని మండిపడ్డారు. తమ డిమాండ్లు పరిష్కరించమని అధికారులు, ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకుంటామన్నా వాళ్లు అవకాశం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని లేకపోతే వచ్చే శాసనసభ ఎన్నికల్లో సీఎం జగన్ కు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

కనీస వేతనాలు అమలు చేయాలి: సమయానికి జీతాలు ఇవ్వాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్న వారిని క్రమబద్ధీకరించాలని సమగ్రశిక్షా ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులమంతా కలిసి సమ్మెబాట పడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

KGBV Teachers Protest: తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి.. కేజీబీవీ మహిళా అధ్యాపకుల ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.