TDP leader Devineni Uma Protest for Paddy Procurement: ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కుదప గ్రామం రైతు భరోసా కేంద్రం వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రోడ్డుపై ధాన్యం పోసి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి.. మద్దతు ధర ఇచ్చి వెంటనే ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి మాటలు కాకుండా.. పని జరిగేలా చూడాలని ధ్వజమెత్తారు. జగన్ మాటకు క్షేత్రస్థాయిలో విలువలేదని ఎద్దేవా చేశారు. నమ్మి ఓట్లు వేసి మోసపోయామని ప్రజలు మండిపడుతున్నారన్నారు. వాలంటీర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని బోగస్, మాయమాటలు చెప్తున్నారని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదు... రైతు భరోసా కేంద్రాలు బోగస్ కేంద్రాలు అని చెప్పడానికే నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు.
ఇవీ చదవండి