ETV Bharat / state

6.25 శాతం కౌలు రైతులకే సాయం.. మిగిలిన వారి పరిస్థితి ఏంటి..? - Rythu bharosa in ap

Tenant Farmers : రాష్ట్రంలో కౌలు రైతులకు సాయం కంటి తుడుపే అవుతోంది. మొత్తం సాగు భూమిలో 70 శాతం వరకు వీరే పండిస్తున్నా.. పంట రుణాల్లో 2 శాతం రుణాలు కూడా వీరికి కూడా అందడం లేదు. 94 శాతం మంది కౌలు రైతులు.. రైతు భరోసా సాయానికి నోచుకోవడం లేదు. కౌలు రైతులకు భరోసా కల్పిస్తాం.. సాగుదారు పత్రాలిస్తామని చెప్పిన ప్రభుత్వం వారి గోడు పట్టించుకోవడం లేదు..

Tenant Farmers In AP
ఏపీ కౌలు రైతులు
author img

By

Published : Apr 10, 2023, 7:39 AM IST

రాష్ట్రంలో కంటితుడుపుగానే కౌలు రైతులకు సాయం

Tenant Farmers In AP : రాష్ట్రంలో కౌలు రైతులకు సాయం కంటి తుడుపే అవుతోంది. మొత్తం సాగు భూమిలో 70 శాతం వరకు వీరే పండిస్తున్నా.. పంట రుణాల్లో 2 శాతం రుణాలు కూడా వీరికి కూడా అందడం లేదు. 94 శాతం మంది కౌలు రైతులు.. రైతుభరోసా సాయానికి నోచుకోవడం లేదు. కౌలు రైతులకు భరోసా కల్పిస్తాం.. సాగుదారు పత్రాలిస్తామని చెప్పిన ప్రభుత్వం వారి గోడు పట్టించుకోవడం లేదు..

ఖరీఫ్‌, రబీ పంట కాలాల్లో ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా పంట రుణాలిస్తున్నా.. అందులో కౌలు రైతులకు 2 వేల కోట్ల రూపాయలు కూడా దక్కడం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కౌలు రైతులకు 4 వేల కోట్ల రూపాయల్ని రుణాల కింద అందించాలని లక్ష్యాన్ని నిర్దేశించగా.. గతేడాది డిసెంబర్‌ వరకు 11 వందల 26 కోట్లే మంజూరయ్యాయి. కానీ, రాష్ట్రం మొత్తంలో 90 శాతానికి పైగా కౌలుదారులకు గుర్తింపు లేదు. దీంతో అధిక వడ్డీలకు బయట అప్పులు తెచ్చుకుని పెట్టుబడులు పెడుతున్నారు. ఫలితంగా వారికి పెట్టుబడి భారం పెరిగిపోతోంది.

కౌలు రైతులకు మొండి చేయి : రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులకు రైతుభరోసా కింద ఏడాదికి 13 వేల 500 చొప్పున ఇస్తామని.. ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. సీఎం అలా ప్రకటించిన అమలులోకి వచ్చేసరికి మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే వర్తింపజేస్తున్నారు. దీంతో ప్రభుత్వం అధికారికంగా అంచనా వేసిన కౌలు రైతుల్లోనూ 6.25 శాతం మందికే రైతుభరోసా సాయం అందుతోంది. మిగిలిన 93.75 శాతం మందికి సర్కారు మొండిచేయి చూపిస్తోంది. కౌలు రైతుల్లో 90 శాతం పైగా వ్యవసాయ కూలీలే. భార్యబిడ్డల నగలు తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి.. పంటలకు పెట్టుబడి పెడుతున్నారు. కౌలు రైతులకు సహాయం చేయడానికి బ్యాంకర్లకు గానీ, సర్కారుకు గానీ మనసు ఒప్పడం లేదు.

రుణ అర్హత కార్డులు : గతంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో పంట కాలానికి ముందే సదస్సులు నిర్వహించి కౌలు రైతుల్ని గుర్తించి.. రుణ అర్హత కార్డులు అందించేవారు. మండల వ్యవసాయ అధికారులు కౌలుదారులకు గుర్తింపు కార్డులు ఇచ్చేవారు. ఈ రెండింటిలో కౌలు రైతులకు ఏదో ఒకటి ఉన్న బ్యాంక్​లు నుంచి పంట రుణాలు అందేవి. నూతనంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కొత్తగా 11 నెలల కాలపరిమితితో పంట సాగుదారు హక్కుల చట్టం- సీసీఆర్​సీని తీసుకొచ్చింది. 2020-21 నుంచి ఈ చట్టం ఆధారంగానే కార్డులను జారీ చేస్తున్నారు. దీనివల్ల కౌలు రైతులకు హక్కు పత్రాలు అందుతాయని ప్రభుత్వం తెలిపింది.

వాస్తవానికి కార్డులు పొందేవారి సంఖ్యతోపాటు రుణాల మంజూరులోనూ కోత పడింది. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు భూ యజమానులు అంగీకరించడం లేదు. భూ యజమాని పాసు పుస్తకంపైనే ఇంకా వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి పంటను అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తోందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఆర్​సీ కార్డులు లేకపోవడంతో పంట రుణాలు అందడంలేదు. దీంతో సున్నా వడ్డీ కూడా దక్కడం లేదు. కౌలు రైతులకు రాయితీపై విత్తనాల కూడా లేవు. పంటలు నష్టాపోయినపుడు నష్టానికి పెట్టుబడి రాయితీ, బీమా పరిహారం కూడా యజమానులకే వెళ్తోంది.

2018-19లో కౌలు రైతులకు అత్యధికంగా 4 వేల 266 కోట్ల రూపాయల పంట రుణాలు అందాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరికి రుణాల్లో కోత మొదలైంది. ఖరీఫ్‌, రబీ రెండు పంట కాలాలకు బ్యాంకులు అందించే మొత్తం పంట రుణంలో.. 10 శాతం కౌలు రైతులకు అందించాలని గతంలో నిర్ణయించారు. రానురాను ఆ లక్ష్యాన్ని తగ్గిస్తున్నారు. తగ్గించిన లక్ష్యంలోనూ సగం కూడా ఇవ్వడం లేదు.

కౌలు రైతుల వివరాలు : రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల మంది కౌలు రైతులు ఉంటారని.. ప్రభుత్వం 2016-17లో వేసిన అంచనానే.. వ్యవసాయశాఖ ఇప్పటికీ వల్లెవేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కౌలు రైతుల సంఖ్య సుమారు 20 లక్షలకు పైగా ఉంటుందని అంచనా. కొన్ని గ్రామాల్లో 90 నుంచి 100 శాతం భూములు కౌలుదారుల ఆధీనంలోనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే పశ్చిమ గోదావరిలో 3.56 లక్షలు, తూర్పు గోదావరిలో 2.44 లక్షలు, కృష్ణాలో 1.96 లక్షలు, గంటూరులో 1.61 లక్షలు, చిత్తూరులో 1.38 లక్షలు, ప్రకాశంలో 1.20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యల్పంగా వైఎస్సార్ జిల్లాలో 17 వేల మంది కౌలు రైతులు ఉన్నట్లు అంచనా.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.