Cheguvera daughter, Manamaralu Coming Vijayawada: ఈనెల 23న విజయవాడలో నిర్వహించనున్న క్యూబా సంఘీభావ సభకు లాటిన్ అమెరికా విప్లవ యోధుడు చేగువేరా కుమార్తె డా. అలైదా గువేరా, మనమరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా రానున్నారు. భారతదేశ పర్యటనలో భాగంగా నగరానికి విచ్చేస్తున్నారని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారి పర్యటనకు సంబంధిచిన పోస్టర్‌ను నేడు ఆవిష్కరించారు.
అమెరికా అంతర్జాతీయంగా ఎదుగుతున్న దేశాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎదగనివ్వకుండా చేస్తుందని హైకోర్టు న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అమెరికా క్యుబాపై చేసిన దాడులను, క్యూబా నిర్బంధించిన విధానానికి వ్యతిరేకంగా సంఘీభావ సభ నిర్వహిస్తారని వివరించారు. ఈ సంఘీభావ సభ 23వ తేదీ సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఎంబీవికే భవన్‌లో నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ సభకి చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనమరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా ముఖ్య అతిధులుగా పాల్గొంటారని తెలియజేశారు. సభకు పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, వామపక్ష నాయకులు పాల్గొంటారని పేర్కొన్నారు.
భారతదేశంలో జరగబోయే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈ నెల 17వ తేదీన చేగువేరా కుమార్తె అలైదా గువేరా, మనవరాలైన ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా కేరళ రాష్ట్రానికి విచ్చేశారు. అనంతరం తిరువనంతపురం నుంచి 18న ఉదయం 9.30 గంటలకు చెన్నై చేరుకుని.. సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి