Ramakrishna comments on Dharmana: సీఎం జగన్మోహన్రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని, మంత్రి ధర్మాన మతిభ్రమించి మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మండిపడ్డారు. కందుకూరులో ప్రమాదవశాత్తు జరిగిన మరణాలను రాజకీయం చేయటం జగన్మోహన్ రెడ్డికి, ఆయన సలహాదారులకు తగదని అన్నారు. చంద్రబాబు వల్లే కందుకూరు మరణాలు జరిగి ఉంటే ఆయనపై హత్యానేరం కేసులు ఎందుకు మోపలేదని ప్రశ్నించారు. అసలు ఏపీకి రాజధాని ఏర్పాటు చేయాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదని అన్నారు. విశాఖను చిన్న రాష్ట్రంగా చేయాలనడం మంత్రి ధర్మాన ప్రసాదరావు అవివేకానికి నిదర్శనమన్నారు. ధర్మాన మంత్రి పదవికి అనర్హుడన్నారు. అమరావతిని ధ్వంసం చేయాలనే కుట్రలో భాగమే ధర్మాన విపరీత వ్యాఖ్యలని రామకృష్ణ విమర్శించారు.
దిగజారి మాట్లాడుతున్న సీఎం.. మతిభ్రమించి మాట్లాడుతున్న మంత్రి ధర్మాన: సీపీఐ నేత రామకృష్ణ - Amaravati Latest News
Ramakrishna comments on Dharmana: ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రమంటూ మంత్రి ధర్మాన మతిభ్రమించి మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రాన్ని మళ్లీ చీలుస్తారా? అని ధ్వజమెత్తారు. అమరావతిని ధ్వంసం చేయాలనే కుట్రలో భాగంగానే ధర్మాన విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారని రామకృష్ణ విమర్శించారు.