ETV Bharat / state

Purandeshwari Fire on Sand Exploitation: ఇసుక దోపిడీ.. తాడేపల్లి ప్యాలెస్‌కు ప్రతి నెలా రూ.200 కోట్లు: పురందేశ్వరి - Purandeshwari comments

Purandeshwari Fire on Sand Exploitation: రాష్ట్రంలో భారీగా పెరిగిన ఇసుక ధరల వల్ల నిర్మాణ రంగం కుదేలైందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక వ్యాపారమంతా ఒకే గుత్తేదారుకు ప్రభుత్వం ఎందుకు కేటాయించిందని ప్రశ్నించారు.

Purandeshwari_Fire_on_Sand_Exploitation
Purandeshwari_Fire_on_Sand_Exploitation
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 31, 2023, 9:23 PM IST

Purandeshwari Fire on Sand Exploitation: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ట్రాక్టర్‌ లోడ్‌ ఇసుక రూ.5 వేల నుంచి రూ.6 వేలకు పెరిగిందని, ఇసుక ధర పెరగడం వల్ల సామాన్యులపై భారం పడిందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా నిర్మాణ రంగాన్ని నమ్ముకున్న కార్మికులు.. పనులు లేక రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ధర పెరిగిపోవడంతో నిర్మాణ రంగం కుదేలైందని ఆరోపించారు. సరైన కూలి పని దొరకక, వేరే పని చేయలేక దాదాపు 40 లక్షల మంది కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని పురందేశ్వరి వాపోయారు.

Purandeshwari Comments: రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా నిల్వలు, నాణ్యత లేని మద్యంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురందేశ్వరి విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ''రాష్ట్రంలో నాణ్యత లేని మద్యం ప్రజలకు విక్రయిస్తున్నారు. అక్రమంగా జేబులు నింపుకోవాలని వైసీపీ భావిస్తోంది. నిత్యం అవసరమయ్యే ఇసుకపైనా అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకుంటుంది. నిర్మాణ రంగాన్ని నమ్ముకున్న వారిపై ఇసుక ప్రభావం పడింది. పనులు లేక భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. గతంలో టన్ను ఇసుక రూ.200 నుంచి రూ.300 మధ్య లభించేది. ఇప్పుడు ట్రాక్టర్‌ లోడ్‌ ఇసుక రూ.5 వేల నుంచి రూ.6 వేలకు పెరిగింది. ఇసుక ధర పెరగడం వల్ల సామాన్యులపై పెను భారం పడింది.'' అని పురందేశ్వరి అన్నారు.

Purandeshwari Fire on YSRCP Govt: రైతుల గోడు పట్టించుకునే పరిస్థితిలో జగన్ ప్రభుత్వం లేదు: పురందేశ్వరి

40 Lakh Construction Workers in AP: రాష్ట్రంలో నిర్మాణ రంగంపై ఆధారపడి జీవించేవాళ్లు దాదాపు 40 లక్షల మంది ఉన్నారని పురందేశ్వరి పేర్కొన్నారు. ఇసుక ధర పెరిగిపోవడంతో నిర్మాణ రంగం కుదేలైందని వ్యాఖ్యానించారు. సరైన కూలి పని దొరకక.. వేరే పని చేయలేక చాలా నానా ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆగ్రహించారు. రాష్ట్రాభివృద్ధి.. నిర్మాణ రంగంతో ముడిపడి ఉందని పురందేశ్వరి గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీని మార్చారని పురందేశ్వరి ఆరోపించారు.

Purandeswari Comments on AP Liquor Policy : 'మద్య నిషేధం హామీ ఏమైంది..? లిక్కర్ తయారీదారులను ఎప్పుడు అరెస్టు చేస్తారో ప్రభుత్వం చెప్పాలి'

Purandeshwari on Tadepalli Palace: కృష్ణా జిల్లా ఇసుకను 21 కోట్ల రూపాయలకు, ఉభయగోదావరి రూ.38 కోట్లు, శ్రీకాకుళం-విజయనగరం జిల్లా రూ.29 కోట్లు, ప్రకాశం జిల్లా ఐదు కోట్లు, నెల్లూరు జిల్లా రూ.23 కోట్లు, చిత్తూరు-అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల పరిధిలో రూ.43 కోట్ల చొప్పున ప్రతినెల 188 కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్‌కు పంపేలా అనుమతులు ఇచ్చారని పురందేశ్వరి ఆరోపించారు.

ఇసుక దోపిడీ ద్వారా ప్రతి నెల రూ.200 కోట్లు తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తున్నాయి: పురందేశ్వరి

రాష్ట్రంలో ఇసుక మైనింగ్‌ ఒకే ఒక్క గుత్తేదారుడికి ఇచ్చారు. కొత్త పాలసీలో భాగంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించారు. ఎవరినీ పోటీకి రానీయకుండా దిల్లీలో ఉండే ఒకే ఒక్క గుత్తేదారుడికి అప్పగించారు. దిల్లీలో ఉండే జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్‌ కంపెనీకి ఇంతకు ముందు మైనింగ్‌లో అనుభవం లేదు. అనుభవం లేని కంపెనీకి ఇసుక మైనింగ్‌ అప్పగించారు. సబ్‌ లీజ్‌ ఇవ్వకూడదన్న నిబంధన ఎంవోయూలో ఉంది. ఈ 16 నెలల కాలంలోనే రెండు వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరాయి. ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని మినహాయిస్తే.. నెలకు 125 కోట్ల రూపాయల వంతున ప్యాలెస్‌కు తరలింది.

Purandeshwari on Liquor Manufacturing Companies Names: మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రభుత్వం బయట పెట్టాలి : పురందేశ్వరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.