Police Solved Rafi Murder Case: విజయవాడలో ఈ నెల 16న గంజాయి, మద్యం మత్తు తలకెక్కిన రౌడీమూక ఓ పేద ముస్లిం యువకుడైన రఫీని హతమార్చిన విషయం తెలిసిందే.. అయితే పోలీసులు ఈ హత్య కేసును ఛేదించారు. రఫీ మర్డర్ కేసులో ప్రధాన నిందితులైన బాషా, యల్లా రెడ్డి, అనిల్‌తో పాటు మొత్తం 14 మంది అరెస్ట్ చేశారు. శ్రీకాంత్ అనే మరో వ్యక్తి పరారిలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. నాగబాబు అనే వ్యక్తిని మద్యం కొనివ్వమనటంతో గొడవ ప్రారంభమైందని.. గొడవ మధ్యలో రఫీ సర్దుబాటు చేసే ప్రయత్నం చేశాడని తెలిపారు. గొడవ అయిపోయిన కొద్ది సమయం తరువాత 15 మంది ఆటో, బైక్‌ల మీద వచ్చి రఫీపై దాడి చేశారు. దాడిలో రఫీని యల్లారెడ్డి కత్తితో పొడవడంతో ఘటన స్థలంలోనే రఫీ చనిపోయాడని పోలీసులు తెలిపారు.
Attacked and killed Indiscriminately: గొడవలు ఎందుకని యువకుడు ప్రశ్నించడంతో పిచ్చెక్కిన గంజాయి మూక.. అతడిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసింది. కృష్ణా జిల్లా పెనమలూరు పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. యనమలకుదురు- తాడిగడప డొంకకరోడ్డుకు చెందిన షేక్ రఫీ బుధవారం సాయంత్రం మసీదు వద్దకు వెళ్తుండగా.. స్థానికుడైన నడకుదుటి నాగరాజుతో ఎల్లారెడ్డి, అనిల్, డాన్ బాషా అనే వ్యక్తులు గొడవ పడుతుండడం గమనించాడు. నాగరాజు పిలవడంతో రఫీ వారి వద్దకు వెళ్లి గొడవ వద్దు.. ఇక్కడి నుంచి వెళ్లిపోండని సూచించాడు.
Sexual Harassment on Boy : గంజాయి మత్తులో.. ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి
ఆగ్రహించిన ఆ ముగ్గురూ రఫీని బెదిరించి వెళ్లిపోయారు. ఆ తర్వాత బాధితుడు మూడురోడ్ల కూడలిలో ఉన్న తన స్నేహితుల వద్దకు రాగా అదే సమయంలో ఎల్లారెడ్డి, అనిల్, డాన్ బాషా, అక్రమ్ అనే వ్యక్తి, మరో 20 మంది కలిసి రెండు ఆటోలు, ద్విచక్రవాహనాలతో అక్కడకు చేరుకొన్నారు. రఫీని కాళ్లతో తొక్కి, కత్తులతో పొడిచి, కర్రలతో కొట్టి పరారయ్యారు. రఫీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు.
Special Police Teams are Searching for Aaccused: దాడికి పాల్పడిన రౌడీమూక మద్యం, గంజాయి మత్తులో ఉన్నట్లు అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గొడవ జరిగిన తరువాత పోలీసులను ఆశ్రయించిన నాగరాజు.. గంజాయి మూక తనను బెదిరించినట్లు తెలిపాడు. అప్పుడే పోలీసులు అప్రమత్తమై ఉంటే ఈ హత్య జరిగేది కాదని రఫీ బంధువులు ఆరోపిస్తున్నారు. దాడికి నిరసనగా పెనమలూరు తహసీల్దారు ఆఫీసు ఎదుట రఫీ మృతదేహంతో గురువారం ఆందోళన చేశారు. రఫీ హత్యపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి 8మందిని అదుపులోకి తీసుకున్నారు. తండ్రి కరీముల్లా ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి, అనిల్, డాన్‌బాషా, అక్రమ్‌లతో పాటు మరికొందరి పైనా కేసులు నమోదయ్యాయి. వీరి కోసం 8 ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితులందరూ కానూరు, పరిసర ప్రాంతాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.