Pattabhi Comments on Sankalpa Siddhi Scam: సంకల్పసిద్ధి స్కామ్‌పై పోలీసుల కంటే ముందే సీఐడీకి ఫిర్యాదులు వచ్చినా.. ఎందుకు చర్యలు తీసుకోలేదో సీఐడీ చీఫ్ సమాధానం చెప్పాలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్న సంకల్పసిద్ధి డిపాజిటర్లకు సునీల్ కుమార్ ఏం జవాబు చెబుతారని ఆయన నిలదీశారు. ఆర్థిక నేరాలను అరికట్టి.. అసలు దొంగల్ని శిక్షించాల్సిన సీఐడీ.. అమాయకుల్ని వేధిస్తూ తాడేపల్లి ప్యాలెస్‌కు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. ఎవరి ఆదేశాలతో సీఐడీ బాస్ చేతులు కట్టుకొని మౌనంగా కూర్చున్నారని పట్టాభిరామ్ ప్రశ్నించారు.
"టెక్నాలజిని కక్ష సాధింపునకు మాత్రమే వాడతారా.. స్కామ్‌లో ఉన్న వారిని పట్టుకోవడానికి వాడరా..? సంకల్పసిద్ధి స్కామ్‌లో తాడేపల్లి కార్యాలయానికి చెందినవారు ఉన్నారు. వల్లభనేని వంశీ వ్యవహారం ఏమిటి ? అతని అనుచరుల పాత్ర ఏమిటి ? తాడేపల్లి కార్యాలయం పాత్ర ఏమిటి ?." -పట్టాభి, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి
ఇవీ చదవండి :