Passenger Facing Difficulties Due to Lack of Buses: సంక్రాంతి పండుగ ప్రయాణాలతో విజయవాడ బస్టాండ్ రద్దీగా మారింది. దూరప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు సొంతూళ్లకు వెళ్లేందుకు ఎగబడుతుండటంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రత్యేకించి మచిలీపట్నం, గుడివాడ, గుంటూరు, ఒంగోలు , ఏలూరు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణాలోని హైదరాబాద్ సహా కర్ణాటకలోని బెంగళూరు, మహారాష్ట్రలోని ముంబై, పూణే తదితర ప్రాంతాల నుంచి రైళ్లు, బస్సుల్లో వచ్చిన ప్రయాణికులు తదుపరి మజిలీ కోసం విజయవాడలో దిగుతున్నారు. దీంతో పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది.
సంక్రాంతి బస్సుల్లేవ్- రయ్ రయ్ మంటున్న బైకులు!
ఆర్టీసీ అధికారులు సమీప ప్రాంతాల సర్వీసులను రద్దు చేసి దూర ప్రాంతాలకు బస్సులు నడపటంతో మచిలీపట్నం, గుడివాడ, ఏలూరు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు బస్సుల కొరత ఏర్పడింది. దీంతో ఆ ప్రాంత ప్రయాణికులు గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి అవస్థలు పడి విజయవాడ చేరుకున్న ప్రయాణికులకు ఇక్కడ గంటల కొద్దీ బస్సు సర్వీసులు అందుబాటులో లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సంక్రాంతి ప్రయాణికులతో కిక్కిరిసిన బస్టాండ్లు- సొంతూళ్లకు వెళ్లేందుకు అవస్థలు
విశాఖ, శ్రీకాకుళం, తిరుపతి, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన దూరప్రాంత సర్వీసులకు రిజర్వేషన్ కారణంగా సీట్లు అందుబాటులో లేకపోవటంతో అధికారులు తాత్కాలికంగా అదనంగా ఎక్స్ ప్రెస్ బస్సులు మాత్రమే ఏర్పాటు చేశారు. నాన్ స్టాప్ బస్సులు తిరిగే గుడివాడ, మచిలీపట్నం, గుంటూరు, ఏలూరు తదితర ప్రాంతాలకు పల్లెవెలుగు బస్సులు ఏర్పాటు చేసి ఆర్టీసీ మమ అనిపించింది. వాటినైనా సమయానికి ఏర్పాటు చేయకపోవటంతో పండిట్ నెహ్రూ బస్టాండ్ రద్దీగా మారింది. ఆర్టీసీ బస్సులు లేకపోవటంతో చాలా మంది ప్రయాణికులు ఆటోలు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. మరోవైపు హైదరాబాద్ వైపు వెళ్లాల్సిన బస్సు సర్వీసులన్నీ ఖాళీగానే ఉండిపోయాయి.
ఊరూవాడా జోరుగా సంక్రాంతి సంబరాలు- భోగి మంటలు జీవితాల్లో వెలుగులు నింపాలంటూ ఆకాంక్ష
Passenger Rush at Visakha Bus Complex: విశాఖ ద్వారక బస్ కాంప్లెక్స్‌లో ప్రయాణికుల రద్దీ కిటికీలాడుతోంది. విశాఖ నుంచి గ్రామాలకు వెళ్లేవారితో బస్టాండ్ ప్రాంగణం రద్దీగా కనిపిస్తోంది. విశాఖ నుంచి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు. పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, హైటెక్ ఏసీ బస్సులు పూర్తి ప్రయాణికుల సామర్థ్యంతో నడుస్తున్నాయి. సంక్రాంతి రద్దీ ని దృష్టిలో పెట్టుకుని.. విశాఖ ఆర్టీసీ అధికారులు దూర ప్రాంతాలకు 110 కి పైగా అదనపు సర్వీసులు నడుపుతున్నారు. జిల్లా, సమీప జిల్లా పరిధిలోని ప్రదేశాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ఎప్పటికప్పుడు నడుపుతున్నారు... విశాఖలోని ద్వారకా బస్ స్టేషన్, మద్దిలపాలెం బస్ స్టేషన్ ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతోంది.