Panchumurti Anuradha : మహిళా జడ్జిని వేధించే స్థాయికి ఏపీలో భద్రత దిగజారడం సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. మంత్రి బుగ్గన ఇలాఖా డోన్‌లో మహిళా జడ్జిపై మందుబాబులు వీరంగం సృష్టించారంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నట్టు అని ఆమె ప్రశ్నించారు. జడ్జి స్థాయిలో ఉన్న వ్యక్తికే రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి.. సామాన్య మహిళలకు ఏం భద్రత కల్పిస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళల పట్ల నేరాలు పెరిగాయని లోక్ సభలో హోం శాఖ ఇచ్చిన నివేదికపై.. జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టు ధిక్కరణ కేసులు, రైతు ఆత్మహత్యలు, మహిళలపై నేరాలు, దళిత, గిరిజనులపై దాడుల్లో రాష్ట్రాన్ని నంబర్ వన్ చేసిన హీన చరిత్ర జగన్ రెడ్డిదేనని ఆరోపించారు.
ఇవీ చదవండి: