ETV Bharat / state

NTR Statue Inauguration: జగన్​ను మళ్లీ గెలిపిస్తే పొరుగు రాష్ట్రాలకు వలస పోవాల్సిందే : అచ్చెన్నాయుడు - TDP

NTR Statue Inauguration: జగన్‌ మాయమాటలు నమ్మి మరోసారి ఆయనకు ఓటేస్తే ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిందేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం పొక్కునూరులో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 16, 2023, 2:57 PM IST

NTR Statue Inauguration in Pokkunuru : ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు, పొక్కునూరు గ్రామాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరాం తాతయ్య, నల్లగట్ల స్వామిదాస్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ తదితరులతో కలిసి ఎన్టీఆర్‌ విగ్రహాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఆయా గ్రామాల్లో జరిగిన బహిరంగ సభల్లో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రూ.200 నుంచి 2వేలకు పెరిగిన కరెంట్ బిల్లు : రాష్ట్రంలో మరోసారి జగన్ మాయమాటలు నమ్మి ఓటేస్తే పనులు లేక తెలంగాణకు వెళ్లి పోవాల్సిందే అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి ఐదు కోట్ల మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో 160 స్థానాల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో కరెంట్ చార్జీలపై సీఎం జగన్మోహన్ రెడ్డితో బహిరంగ చర్చకు తాను సిద్ధం, సీఎం సిద్ధమా అని ప్రశ్నించారు. గత నాలుగున్నర ఏళ్లలో కరెంటు చార్జీలను విపరీతంగా పెంచాడు. 2 వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 2 వేల రూపాయలకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఏ ఇంటికి వెళ్లినా స్వయంగా నిరూపిస్తామని, నిరూపించలేకపోతే రాజకీయాలకు స్వస్తి పలుకుతానని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడని మండిపడ్డారు.

High Electricity Bill: రెండు ఫ్యాన్లు, బల్బులు.. బిల్లు చూస్తే షాక్​

రాష్ట్రంలో శాంతి భద్రతలు : రాష్ట్రంలో పంచభూతాలను సీఎం జగన్ దోచుకున్నాడని, రాష్ట్రంలో విశాఖపట్నంలో వైఎస్సార్సీపీ ఎంపీ సత్య నారాయణ భార్యను, కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేసే పరిస్థితికి శాంతి భద్రతలు దిగజారాయని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. విజయవాడ హైవే నుంచి పోక్కనూరు రావడానికి గతుకుల రోడ్డుపై రెండు గంటలు పట్టింది. అమరావతి రాజధానిని సీఎం జగన్ సర్వనాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CBN ONE LAKH VOTES LOGO: టీడీపీని నమ్ముకుంటే అభివృద్ధి.. వైసీపీని నమ్ముకుంటే జైలు: చంద్రబాబు
16 నెలలు జైలు జీవితం : తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు దోపిడీ చేసి, 11 కేసుల్లో సీబీఐ కేసుల్లో ఏ వన్ నిందితుడిగా ఉన్న జగన్.. 16 నెలలు జైలు జీవితం గడిపారని అన్నారు. జైల్లో ఉండి అవినీతి కేసుల్లో ఉన్న వ్యక్తిని పార్టీ పెట్టుకొని ఓట్లు వేయమని వస్తే ప్రజలు ఓట్లు వేసి తప్పు చేశారని కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

సౌమ్య గెలవకపోతే రాజకీయ సన్యాసం : వచ్చే ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య విజయం సాధించపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టీడీపీ కార్యకర్తలకు మాజీ మంత్రి దేవినేని ఉమా సూచించారు.

'2 వందల రూపాయలు వచ్చే కరెంట్ బిల్లు నాలుగున్నర సంవత్సరాల తరువాత 2 వేల రూపాయలకు పెరిగింది. ఎవరు వస్తారో రండి.. మేము ఉన్నప్పుడు తక్కువ బిల్లు వచ్చేదని, మీరు ఉన్నప్పుడు ఎక్కువ బిల్లు వస్తుందని నిరూపిస్తాం. నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చాలెంజ్ చేస్తున్నాను.'- అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

YCP vs All Parties: విద్యుత్ ఛార్జీల పెంపుపై అఖిలపక్షాలు ఆగ్రహం.. ఉద్యమానికి శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.