NTR centenary celebrations: ఎన్టీఆర్ శతాబ్ది వేడుకలు తెలుగు వారి ఆత్మ గౌరవ చిహ్నం, సమాజ అభ్యుదయ సంస్కారానికి దీపం అని రేపల్లె రంగస్థల ప్రముఖులు మన్నె శ్రీనివాసరావు అన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా గుంటూరు జిల్లా, తెనాలి ఎన్జీవో కళ్యాణ మండపంలో ఆయనకు, సినీ, టీవీ, రంగస్థల నటి ఎ.నాగమణికి ఎన్టీఆర్ శతాబ్ది పురస్కారం ప్రదానం చేశారు. రూ.10 వేల నగదు, శాలువా, జ్ఞాపిక గజమాలతో సత్కరించారు. సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ భక్తుడైన తనకు ఆయన ముందు ఏక పాత్ర చేసే అవకాశం గండిపేటలో దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. బాపట్ల వ్యవసాయ కళాశాల శంకుస్థాపనకు వచ్చిన ఎన్టీఆర్ తనను పక్కన కూర్చోబెట్టుకుని అరుదైన గౌరవం ఇచ్చారని శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు.
ఎన్టీఆర్ కళా పరిషత్ ఏర్పాటు చేసి బహుబాషా నాటికల పోటీలను తొలి సారిగా నిర్వహించామని, వెండి తెర వేల్పు, కారణ జన్ముడు పేరుతో ఐదు సంపుటాలు రచిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. సినీ, టీవీ నటి మాట్లాడుతూ, సినీ రాజకీయ రంగాల్లో స్పష్టంగా కనబడల్లో ఎన్టీఆర్ లేని లోటు. సామ్రాట్ అశోక్ సినిమా చిత్రీకరణలో భయంతో దూరంగా కూర్చున్న తనను దగ్గరకు పిలిచి అందరికి చేసి సినిమాల్లో పాత్రలు అందించడం తనకు మరిచి పోలేని నాగమణిని కలిగి ఉంది. మహానుభావుడు పేరుతో ఇచ్చిన పురస్కారం తన జన్మ ధన్యమై ఉంది. నాట ప్రయోక్త కెఎస్టి సాయి, చలసాని కృష్ణ ప్రసాద్, కేసన కోటేశ్వరరావు, అయినాల మల్లేశ్వరరావు, చెరుకుమల్లి సింగారావు, భీమవరపు సునీత పనిచేస్తున్నారు.
'ఎన్టీఆర్ పై భక్తితో 1996లో అప్పటి ఆంధ్రప్రదేశ్ లోనే మెుదటిసారిగా నాటక కళాపరిషత్ స్థాపించాను. అలా 1996నుంచి 2005 సంవత్సరం వరకు కొనసాగింది. ఎన్టీఆర్ కళానాటకపై ప్రక్రియను పరిచయం చేశాం.ఎన్టీ రామారావు పేరు మీద బహుభాషా నాటకపోటీలు రేపల్లెలో నిర్వహించడం జరిగింది.'- మన్నె శ్రీనివాసరావు, రంగస్థల ప్రముఖులు
రచయిత ఆళ్ల నాగేశ్వరరావుకు జలకవి రత్న పురస్కారం: పట్టణానికి చెందిన రచయిత ఆళ్ల నాగేశ్వరరావుకు జల కవి రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. హైదరాబాద్ నగర జలమండలి. జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థ సంయుక్తంగా జల సంరక్షణ దినోత్సవం పురస్కరించుకుని జాతీయ స్థాయిలో కవితల పోటీలు నిర్వహించారు. ఆయన పంపిన వచన కవిత జీవ జలం పోటీలో పురస్కారానికి ఎంపికైంది. నేడు హైదరాబాద్‌లో పురస్కారం అందుకోనున్న ఆయనకు పలపవురు అభినందించారు.
ఇవీ చదవండి: