ETV Bharat / state

'జయహో బీసీ' సభలో ఖాళీగా కుర్చీలు.. భారీగా మద్యం సీసాలు

author img

By

Published : Dec 7, 2022, 5:55 PM IST

CM Jagan at Jayaho BC program in Vijayawada: విజయవాడలో వైసీపీ నిర్వహించిన జయహో బీసీ సభకు స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. సభలో కుర్చీలన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. మరోవైపు సభకు వచ్చిన కొంతమంది దగ్గర నుంచి మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Jayaho BC program
జయహో బీసీ సభ

CM Jagan at Jayaho BC program in Vijayawada: విజయవాడలో వైసీపీ నిర్వహించిన జయహో బీసీ సభకు వచ్చిన వారిలో అత్యధికులు.. సీఎం జగన్ ప్రసంగిస్తున్నప్పుడే వెళ్లిపోయారు. సీఎం ప్రసంగం కొనసాగుతున్న సమయంలో చాలావరకు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. బయటికి వెళ్లేవారితో ద్వారాల వద్ద కొంత తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఓ మహిళ కిందపడి చేయి విరిగింది. ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అలాగే సభా ప్రాంగణంలోకి వెళుతున్న వారిని తనిఖీ చేసిన పోలీసులు.. చాలామంది నుంచి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ సీసాలను చెత్త డబ్బాల్లో వేయించారు.

తరలివచ్చిన వారి నుంచి పెద్ద సంఖ్యలో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని స్టేడియం లోపలికి పంపించే క్రమంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ సమయంలో మద్యం సీసాలను వారి వద్ద గుర్తించి వాటిని ప్రవేశ ద్వారం వద్దనే తీసుకుని ఆ తర్వాతే లోపలికి పంపించారు. ఈ మద్యం సీసాలను ఎప్పటికప్పుడు డస్ట్‌బిన్‌లోకి వేయించారు. మద్యం సీసాల స్వాధీనం చిత్రాలను తీస్తున్నట్లు గమనించిన పోలీసులు వెంటనే.. ఆ ప్రవేశ ద్వారం మూసివేయించి అక్కడి జనాలను వేరే మార్గం ద్వారా పంపించారు. సీఎం ప్రసంగం జరుగుతున్న సమయంలోనే ఒకేసారి వచ్చిన వారంతా భోజనానికి తరలివెళ్లారు. 80 వేల మంది సభలో పాల్గొన్నారంటూ సీఎం పేర్కొన్న సమయంలో మైదానంలోని వెనుక సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. భోజన ప్రదేశంలో తోపులాట జరిగింది.

జయహో బీసీ సభకు తరలివచ్చిన వారి నుంచి పెద్ద సంఖ్యలో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.