Netherlands Team cricketer Anil Teja: క్రికెట్‌లో ఏ బంతికి ఏ అద్భుతం జరుగుతుందో చెప్పలేం. అలాంటి అద్భుతాన్నే 2023 ప్రపంచ కప్ క్రికెట్‌లో పసికూన నెదర్లాండ్ జట్టు అవిష్కరించింది. వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లో 375 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు నెదర్లాండ్ ముందు ఉంచింది. అంతేకాకుండా డచ్ టీమ్‌ను తక్కువ అంచనా వేసిన కరేబియన్లు డచ్ టీమ్ ధాటికి కంగుతిన్నారు. ఈ ఆటలో మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లినప్పటికీ, అంతకుముందు మ్యాచ్ టై కావడానికి నిడమనూరు అనిల్ తేజ కారణమయ్యాడు. నెదర్లాండ్స్ తరఫున మైదానంలో వీరోచిత పోరాటం చేసి జట్టుకు మంచి గుర్తింపును తీసుకువచ్చాడు. ఇంతకీ ఎవరీ అనిల్ తేజ అనుకుంటున్నారా? నెదర్లాండ్ క్రికెటర్ గురించి ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? అయితే తేజ క్రికెట్ నెదర్లాండ్ తరఫున ఆడిన అతను మాత్రం భారత సంతతికి చెందిన వ్యక్తే.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన అనిల్ తేజ కుటుంబం అతని చిన్నతనంలోనే విజయవాడ నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లారు. క్రికెట్ అంటే అభిమానంతో అనిల్తేజ న్యూజిలాండ్‌లోనే క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆక్లాండ్ జట్టు తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత తేజకు డచ్ దేశంలో ఉద్యోగ అవకాశం లభించింది.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పిచ్ వెనుక ఓ 'రైతు'- ఎవరికీ తెలియని సీక్రెట్ ఇది!
ఉద్యోగం రావడంతో తేజ డచ్‌కు మారిపోయాడు. ఉద్యోగం వచ్చిన కూడా తేజ క్రికెట్‌ను మాత్రం వదలలేదు. ఆటపై ఉన్న ఇష్టం అతనిలో మరింత ఉత్సహాన్ని నింపి ఆటవైపు అడుగులు వేయించింది. ఉద్యోగం చేస్తూనే క్రికెట్ ఆడటం ప్రాక్టిస్ చేసుకునేవాడు. ఈ నేపథ్యంలో అతను డచ్ దేశంలో క్రికెట్ ఆడేవాడు. అతనికి ఒక్కసారిగా దేశం తరఫున ఆడే ఆవకాశం లభించింది. క్రికెట్ క్లబ్స్ నెదర్లాండ్స్ తరపున ఆటలో మంచి ప్రదర్శనను ఇస్తున్న తేజపై ఇతర దేశాల క్రికెట్ క్లబ్స్ పడ్డాయి. వారంతా తేజ కోసం పోటిపడ్డాయి.
అనేక దేశాల క్రికెట్ క్లబ్స్ కోసం ఆడుతున్న సమయంలోనే ఇంగ్లాండ్‌లో క్లబ్ తరఫున కూడా పోటిలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకే క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించారు. నెదర్లాండ్ తరఫున వన్డే క్రికెట్‌లోకి మొదటి సారిగా అంతర్జాతీయ స్థాయిలో అడుగుపెట్టాడు. నెదర్లాండ్ వెస్టిండీస్ ప్రత్యర్థులుగా ఆడిన తొలిమ్యాచ్‌లోనే అర్థ సెంచరితో అందర్ని ఆకట్టుకున్నాడు. ఐపీఎల్లో అడుగు పెట్టాలని చూస్తున్న తేజను చేజిక్కించుకునేందుకు ఫ్రాంచేజీలు ఆసక్తి చూపుతున్నారు. తేజ కేవలం బ్యాంటిగ్లోనే కాకుండా బౌలింగ్‌లోనూ రాణిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన యువ క్రికెటర్ అనిల్ తేజతో మా ప్రతినిధి ముఖాముఖి.
వరల్డ్ కప్‌లు గెలవడం అంత సులువు కాదు- వచ్చే టీ20 ప్రపంచ కప్ భారత్‌దే! : రవి శాస్త్రి