ETV Bharat / state

Nara Lokesh Padayatra at Vijayawada Autonagar: "రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై టీడీపీకి కచ్చితమైన విధానముంది" - lokesh yuvagalam padayatra in vijayawada

Nara Lokesh Padayatra at Vijayawada Autonagar: లోకేశ్​ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో భాగంగా.. విజయవాడ ఆటోనగర్​లో నిర్వహించిన సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. ఆటోనగర్​లోని కార్మికుల కష్టాలను, ఇతర రంగాలు ఎదుర్కోంటున్న నష్టాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

Nara_Lokesh_Padayatra_at_Vijayawada_Autonagar

author img

By

Published : Aug 20, 2023, 8:40 PM IST

Nara Lokesh Padayatra at Vijayawada Autonagar: "రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై టీడీపీకి కచ్చితమైన విధానముంది"

Nara Lokesh Padayatra in NTR District : వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని రంగాలూ కుదేలయ్యాయని.. వివిధ రంగాల ప్రతినిధులు లోకేశ్​ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులతో పాటు పెట్రోల్‌, డీజిల్‌ ధరల మోతతో రవాణా రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశారని గోడు వెల్లబోసుకున్నారు. ఎందరికో ఉపాధి కల్పిస్తున్న ఆటోనగర్‌ను ప్రైవేటీకరించేందుకు జీవో తెచ్చారని.. అది అమలైతే లక్షల మంది రోడ్డున పడతారని వివరించారు. సమస్యలను విన్న లోకేశ్​.. టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అన్ని ఆటోనగర్‌లకు పూర్వ వైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు. వంద రోజుల్లో ఏ రాష్ట్రంలో తక్కువ పన్నులు అమల్లో ఉన్నాయో అధ్యయనం చేసి ఏపీలో అమలు చేస్తామని.. దశల వారీగా ఇంధన ధరలు తగ్గించే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

బెజవాడలో తెలుగుదేశం మీసం మెలేసింది.. లోకేశ్ యువగళంకు బ్రహ్మరథం

Autonagar Representatives met Lokesh: యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్​.. విజయవాడ ఆటోనగర్‌లో పని చేసే 20కి రంగాలకు పైగా ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఏపీలో రవాణా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని లోకేశ్​కు లారీ యాజమానుల సంఘం ప్రతినిధులు వివరించారు. గ్రీన్‌ట్యాక్స్‌ పేరుతో నిలువునా దోపిడీ చేయడంతో పాటు వివిధ రకాల పన్నులు, జరిమానాలు, ఇంధన ధరల మోతతో కోలుకోలేని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Lokesh Fires on CM Jagan: ఆటోనగర్‌ను ప్రైవేటీకరిస్తామని లక్షల మందిని రోడ్డున పడేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని.. దీనిని అడ్డుకోవాలని కోరారు. ఆటోనగర్‌తో ముడిపడి ఉన్న ఎన్నో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నాయని లోకేష్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఆటోనగర్‌లో పనిచేస్తున్న కార్మికులకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇవ్వాలని, బీమా సౌకర్యం కల్పించాలని, ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని.. ఇలా అనేక సమస్యలు వివరించారు.

Lokesh Defamation Case on Posani: అసత్య ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టను: లోకేశ్​

"టీడీపీ హయాంలో 200 రూపాయలు ఉన్న గ్రీన్​ ట్యాక్స్​ను నేడు వైసీపీ ప్రభుత్వం.. 26వేల 860 రూపాయలు విధించింది. రెండు వేల రూపాయలు ఉండే ఓవర్​ లోడ్​ పన్నును.. 20వేల రూపాయలకు పెంచారు. ఇన్ని సంవత్సరాలు లారీలు నడుపుకుని బతికిన వారు ఇప్పుడు రోడ్డున పడ్డారు." -రవాణా రంగం ప్రతినిధి

"రాష్ట్రంలో రోడ్లు సరిగా లేక వాహనాల నిర్వహణ ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. నాలుగున్నర సంవత్సరాలలో పన్నుల పేరుతో భారాన్ని విధించారు. మాకు కార్పోరేషన్​ ఏర్పాటు చేయండి." -రవాణా రంగం ప్రతినిధి

జగన్ రెడ్డి రాజ్యం.. నేరగాళ్లకు స్వర్గంలా మారింది : లోకేశ్‌

Lokesh promise to Autonagar Representatives: సమస్యలు విన్న లోకేశ్​ విజయవాడతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆటోనగర్‌లకు పూర్వ వైభవం తెస్తామని హామీ ఇచ్చారు. పెద్ద పరిశ్రమలు ఎంత ముఖ్యమో, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలూ అంతే అవసరమని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రకటించిన 20లక్షల ఉద్యోగాల హామీ పారిశ్రామికాభివృద్ధితోనే సాధ్యమన్నారు. అధికారంలోకి రాగానే ఆటోనగర్‌ని ప్రైవేటీకరించేందుకు తెచ్చిన జీవోలను రద్దు చేస్తామని చెప్పారు. పన్నుల విధింపుపైనా స్పష్టత ఇచ్చారు.

ఆటోనగర్‌, రవాణా రంగంపై ఆధారపడిన కార్మికులకు బీమా కల్పిస్తామన్న లోకేశ్​ వృత్తినైపుణ్యంలో శిక్షణ ఇస్తామని చెప్పారు. మౌలిక వసతుల కల్పనను ఓ క్రమపద్ధతిలో చేస్తామని హామీ ఇచ్చారు. ఆటోనగర్‌ పూర్వవైభవానికి కావాల్సిన పాలసీలు తాము తీసుకొస్తామన్న లోకేశ్ రిటర్న్​ గిఫ్ట్‌గా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు.

"అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పన్నులను పక్క రాష్ట్రాలతో సరిపోల్చి.. తక్కువ పన్నులను అమలు చేస్తాము. ఈ బాధ్యతను టీడీపీ తీసుకుంటుది. పెట్రోలు, డిజీల్​పై విధించే పన్నులను పద్ధతి ప్రకారం తగ్గిస్తాం" -నారా లోకేశ్​

Nara Lokesh Meeting With YSRCP Victims in Yuvagalam: 'రాష్ట్రంలో న్యాయం బతికుందా..?'.. వైసీపీ బాధితుల సమావేశంలో లోకేశ్‌ ధ్వజం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.