ETV Bharat / state

మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో మందు పార్టీ.. వీడియో వైరల్ - మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో మందు పార్టీ

Drink Party in Mylavaram Agricultural Market: ఎన్టీఆర్ జిల్లా మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు సిబ్బంది మరో ఇద్దరితో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని సిబ్బంది ఆఫీస్ గదిలో మందు తాగుతూ యార్డ్ అసిస్టెంట్‌లు విధులు నిర్వర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Mylavaram
మైలవరం వ్యవసాయ మార్కెట్
author img

By

Published : Jan 20, 2023, 3:17 PM IST

మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో మందు పార్టీ

Mylavaram Agricultural Market In drink party: ఎన్టీఆర్ జిల్లా మైలవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు సిబ్బంది మరో ఇద్దరితో కలిసి మందు పార్టీ చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లోని సిబ్బంది ఆఫీస్ గదిలో యార్డ్ అసిస్టెంట్‌లుగా విధులు నిర్వహిస్తున్న పీర్ సాహెబ్, నాగరాజులు కనుమ రోజున మందు తాగుతూ విధులు నిర్వర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది.

వీడియోలో ఉన్న దృశ్యాల ప్రకారం.. ఆఫీసు గదిలోని టేబుల్‌పై మార్కెట్‌కు సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్ మధ్యలోనే మందు కలిపిన మూడు మందు గ్లాసులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ గ్లాసుల కొద్దీ దూరంలోనే మందు సీసా కూడా ఉంది. టేబుల్ ఇరువైపులా సిబ్బంది కూర్చోగా, మరొకరు చరవాణిలో దృశ్యాలను చిత్రీకరించారు. ఆ తర్వాత ఓవైపు విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు మందు పార్టీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

వీడియోను వీక్షిస్తున్న స్థానికులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆఫీస్ గదిలో మందు పార్టీ చేసిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందు తాగుతూ ఇష్టానుసారంగా విధులు నిర్వహిస్తున్న యార్డ్ అసిస్టెంట్‌లను వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని కామెంట్లు పెడుతున్నారు. ఇద్దరు కలిసి రైతుల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ.. ఇలా మందు పార్టీలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వ్యవసాయ అధికారులు స్పందించి అసిస్టెంట్‌లపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.