ETV Bharat / state

MP Galla Jayadev Mentioned Chandrababu Arrest in Parliament: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ అంశం.. లోక్​సభలో లేవనెత్తిన ఎంపీ గల్లా జయదేవ్ - MP Galla Jayadev Parliament comments

MP Galla Jayadev Mentioned Chandrababu Arrest in Parliament: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయాన్ని పార్లమెంట్‌లో ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్‌డే అని వర్ణించారు. స్కిల్‌ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు నిర్ధరణ కాకపోయినా, రాజకీయ కక్షసాధింపులో భాగంగానే చంద్రబాబు అరెస్టు చేశారని గుర్తుచేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు స్పందించి..చంద్రబాబు విడుదలకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

MP_Galla_Jayadev_Mentioned_Chandrababu_Arrest

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2023, 6:53 PM IST

చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ప్రధాని, కేంద్రహోంమంత్రి చర్యలు తీసుకోవాలి: ఎంపీ గల్లా జయదేవ్

MP Galla Jayadev Mentioned Chandrababu Arrest in Parliament: తెలుుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అక్రమ అరెస్ట్‌ గురించి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. చంద్రబాబును అరెస్ట్ చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్‌డే అని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు నిర్ధరణ కాకపోయినా, రాజకీయ కక్షసాధింపుతో చంద్రబాబును అరెస్టు చేశారని గుర్తు చేశారు. కీలక సంస్కరణలు తీసుకొచ్చి.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడిన, తద్వారా దేశ పురోగతికి తోడ్పాటును అందించిన చంద్రబాబు లాంటి నేతను అరెస్టు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలు దృష్టి సారించాలని ఆయన కోరారు.

Debate in Parliament on AP Bifurcation: దేశ రాజధాని దిల్లీలో నేటి నుంటి ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. తొలి రోజు సమావేశాల్లో నేటి ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో ప్రసంగించారు. ప్రసంగంలో భాగంగా రాజ్యాంగ పరిషత్తు ఆవిర్భావం నుంచి 75 ఏళ్లలో పార్లమెంటు ప్రస్థానం, విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలతోపాటు ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ క్రమంలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయాన్ని పార్లమెంట్‌ దృష్టికి తీసుకెళ్లారు.

MP Galla Jayadev Comments: పార్లమెంట్‌లో ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ..'' ప్రతి ప్రభుత్వం దేశ అభివృద్ధికి పాటుపడాలని ప్రధాని చెప్పారు. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని ప్రధాని మోదీ ఉదయం చెప్పారు. విభజన చట్టం హామీలు ఇంకా నెరవేరాల్సి ఉంది. రాష్ట్ర రాజధాని విషయంలో ఇప్పటికీ గందరగోళం ఉంది. ఏపీ రాజధాని ఏదన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు పోరాడుతున్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చారు. రాజధాని అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు..కానీ, ఇంకా ఇవ్వలేదు.'' అని ఆయన అన్నారు.

Yamamala Met Chandrababu Naidu in Mulakat: చంద్రబాబు జైలులో సంతోషంగా లేరు.. ప్రజల గురించే ఆలోచన: యనమల

Jayadev Mentioned the Illegal Arrest of Chandrababu: అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును పార్లమెంటులో ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రస్తావించారు. తమ పార్టీ నేత చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని, నిర్ధరణ కాకుండానే అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని వివరించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని గల్లా జయదేవ్‌ డిమాండ్ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు దృష్టిపెట్టాలని గల్లా జయదేవ్‌ విజ్ఞప్తి చేశారు.

Chandrababu Arrest is a Black Day in the History of AP: అంతేకాకుండా, ఐటీని చంద్రబాబు ప్రోత్సహించి.. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో గుర్తు చేశారు. చంద్రబాబు అనేక సంస్కరణలతో ప్రగతి సారథిగా నిలిచారన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన రోజు ఏపీ చరిత్రలో బ్లాక్‌డేగా నిలిచిపోయిందని వివరించారు. చట్టాలను తుంగలో తొక్కిన తీరును ప్రధాని మోదీ, హోంమంత్రి దృష్టికి తెస్తున్నానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు చౌకబారు ఎత్తుగడలు వేశారన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో రూ.371 కోట్లు విడుదల చేశారన్నది ప్రధాన ఆరోపణనన్న గల్లా జయదేవ్..చంద్రబాబుకు డబ్బు అందినట్టు ఎలాంటి ఆధారాలు చూపలేదని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఆపేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం చంద్రబాబును వెంటనే విడుదల చేసేలా ప్రధాని చొరవ చూపాలని ఎంపీ గల్లా జయదేవ్‌ కోరారు.

PM Modi On Telangana Formation in Parliament : 'తెలంగాణ ఏర్పాటు ఎంతో ప్రయాసతో జరిగింది.. రక్తపుటేర్లు పారాయి'

YSRCP MP Mithun Reddy Comments: ఈ నేపథ్యంలో ఎంపీ గల్లా జయదేవ్‌ ఆరోపణలపై వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి స్పందిస్తూ.. చంద్రబాబు హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరిట స్కామ్ జరిగిందని ఆరోపించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో రూ. 371 కోట్ల అవినీతి జరిగిందని మిథున్‌ రెడ్డి పేర్కొన్నారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. చంద్రబాబు అరెస్టులో ఎలాంటి కక్ష సాధింపు లేదని మిథున్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో కోర్టు పరిధిలోని అంశాలపై సభలో మాట్లాడటం సరికాదని ప్యానల్‌ స్పీకర్‌ తెలిపారు.

AP BJP Chief Purandeswari Comments: మద్యం అవినీతిలో కర్త, కర్మ, క్రియ వైసీపీ ప్రభుత్వమే: పురందేశ్వరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.