Mother Died after Giving Birth to Three Children in NTR District: పెళైన 14 సంవత్సరాల తరువాత సంతానం కలిగిందన్న సంతోషం అంతలోనే విషాదాన్ని మిగిల్చింది. పిల్లల కోసం ఎంతగానో ఎదురుచూసిన దంపతుల ఆనందం ముక్కలైంది. ముద్దుముద్దుగా ఉన్న ముగ్గురు పిల్లలకు ఒకే కాన్పులో జన్మనిచ్చిన తల్లి.. మురిపెం తీర్చుకొనకముందే.. కానరాని లోకాలకు చేరుకుంది. ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన కంటతడి తెప్పిస్తోంది.
తల్లి మృతి.. లేపేందుకు చిన్నారి ప్రయత్నం!
After Many Years Woman gives Birth to Three Children: వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని నందిగామ మండలం మాగల్లు గ్రామానికి చెందిన షేక్ నజీరా(35)ను పల్లగిరికి చెందిన ఖాసింతో 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే వారికి సంతానం కలగలేదు. పిల్లల కోసం ఆ దంపతులు దేవుడిని ప్రార్థించని రోజు లేదు. ఎట్టకేలకు చాలా సంవత్సరాల తర్వాత ఆమె గర్భం దాల్చింది. దీంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగితేలింది. పది రోజుల క్రితం అమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేయగా.. ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఎన్నేళ్లగానో పిల్లల కోసం ఎదురుచూస్తున్న ఆ దంపతులకు.. ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ కలిగాడు.
రోడ్డు ప్రమాదం: 13 నెలల పసిపాపతో సహా తల్లి మృతి
దీంతో ఆ కుటుంబంలో ఆనందాలకు అవధులు లేవు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే పిల్లలను తనివితీరా చూసుకోకుండానే ఆ తల్లి అధిక రక్తస్త్రావంతో కన్నుమూసింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతదేహాన్ని పల్లగిరి గ్రామానికి తీసుకునివచ్చి.. ముస్లిం సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. భర్త, బంధువుల ఆర్తనాదాలతో గ్రామంలో విషాదం నెలకొంది. ముక్కుపచ్చలారని ఆ పసిపిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పల్లగిరి, మాగల్లు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, బంధువులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. భార్య ప్రాణాలను కాపాడుకోడానికి విశ్వప్రయత్నంచేసినా.. దక్కించుకోలేదనే ఆవేదన, ముగ్గురు పిల్లలను కాపాడుకోవాలనే ఆశతో ఖాసిం విలవిల్లాడుతున్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వమే తన పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని వేడుకుంటున్నాడు.
పెళ్లింట విషాదం... రోడ్డు ప్రమాదంలో వరుని తల్లి మృతి
"నాకు నజీరాతో 14 ఏళ్ల క్రితం వివాహమైంది. చాలా ఏళ్లు మాకు సంతానం కలగలేదు. పిల్లల కోసం మేము ఎంతగానో ఎదురుచూడగా.. ఇప్పటికి మాకు సంతానం కలిగింది. ఒకే కాన్పులో నా భార్య ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఈ వార్తతో మా కుటుంబంలో సంతోషానికి అవధులు లేవు. అయితే ఆ ఆనందం అంతలోనే గాల్లో కలిసిపోయింది. అధిక రక్తస్త్రావంతో నా భార్య కన్నుమూసింది. పిల్లల ముద్దూముచ్చట చూడకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయింది. ఇప్పుడు ముక్కుపచ్చలారని నా బిడ్డల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వమే నా పిల్లల భవిష్యత్తుకు మార్గాన్ని చూపాలని కోరుతున్నాము." - ఖాసిం, మృతురాలి భర్త