Lack of Basic Facilities in AP Govt Hostels: వసతి గృహాల్లో సంక్షేమంపై ప్రభుత్వం ఎన్నో హామీలిస్తున్నా వాటి దుస్థితి మారడం లేదు. మౌలిక సదుపాయాల కొరత వసతి గృహాలను పట్టిపీడిస్తోంది. చలికాలంలోనూ.. విద్యార్థులు నేలపైనే పడుకోవాల్సిన పరిస్థితి. విద్యార్థులకు కనీసం బెడ్స్ సదుపాయం కూడా లేకపోవడంపై.. ఇటీవల హైకోర్టు ఆగ్రహించిన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని వసతిగృహాల దుస్థితిపై కథనం.
ఎన్టీఆర్ జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలు నిర్లక్ష్యానికి నిలువెత్తు దర్పణాలుగా నిలుస్తున్నాయి. వీటి సంక్షేమానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా.. ఆచరణలో పరిస్థితి విరుద్ధంగా ఉంది. చాలా హాస్టళ్లలో పరిస్థితి దయనీయంగా ఉంది. కనీస సదుపాయాలు కొరవడ్డాయి.
కొన్ని హాస్టళ్లకు బెడ్స్ కేటాయించినప్పటికీ.. నేటికీ విద్యార్థులు నేలపై నిద్రించాల్సిన దుస్థితి కొనసాగుతోంది. నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్న తరుణంలో విద్యార్థులకు ఇచ్చే మెనూ ఛార్జీలు ఎటూ చాలటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వసతిగృహాల్లో చాలాచోట్ల 'నాడు-నేడు' పనులు జరగడం లేదు. శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే విద్యార్థులు చాలాచోట్ల తలదాచుకుంటున్నారు.
"జిల్లాలో ప్రభుత్వ వసతి గృహాలు నిర్లక్ష్యానికి నిలువెత్తు దర్పణాలుగా నిలుస్తున్నాయి. వీటి సంక్షేమానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా.. ఆచరణలో పరిస్థితి విరుద్ధంగా ఉంది. చాలా హాస్టళ్లలో పరిస్థితి దయనీయంగా ఉంది. కనీస సదుపాయాలు కొరవడ్డాయి. కొన్ని హాస్టళ్లకు బెడ్స్ కేటాయించినప్పటికీ.. నేటికీ విద్యార్థులు నేలపై నిద్రించాల్సిన దుస్థితి కొనసాగుతోంది. నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్న తరుణంలో విద్యార్థులకు ఇచ్చే మెనూ ఛార్జీలు ఎటూ చాలటం లేదు. శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే విద్యార్థులు తలదాచుకుంటున్నారు." - వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
పేరుకే వసతి గృహం కనీస సౌకర్యాలూ గగనం - గిరిజన సంక్షేమ హాస్టళ్లలో సమస్యల తాండవం
వసతిగృహాల్లో సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో కన్పించడం లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వసతిగృహాల పరిస్థితి అధ్వానంగా ఉంది. వసతిగృహాల్లో సమస్యలపై గతంలో విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా.. నామమాత్రంగా మెనూ ధరల్ని పెంచినప్పటికీ మిగతా సమస్యల్ని గాలికొదిలేశారు. నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ ధరల్ని పెంచడంతోపాటు కాస్మోటిక్ ఛార్జీలను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
"వసతిగృహాల్లో సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో కన్పించడం లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే వసతిగృహాల పరిస్థితి అధ్వానంగా ఉంది. వసతిగృహాల్లో సమస్యలపై గతంలో విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా.. నామమాత్రంగా మెనూ ధరల్ని పెంచినప్పటికీ మిగతా సమస్యల్ని గాలికొదిలేశారు." - సాయికుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి
Government Hostel Problems: శిథిలావస్థకు హాస్టళ్లు.. ప్రాణభయంతో విద్యార్థులు