ETV Bharat / state

12న శ్రీకాకుళం జిల్లాలో జనసేన 'యువశక్తి' బహిరంగ సభ

Janasena Yuvasakthi Meeting : ఈనెల 12వ తేదీన జనసేన శ్రీకాకుళం జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. స్వామి వివేకానంద జయంతి రోజున ఆయన స్పూర్తితోనే ఈ సభ నిర్వహించనున్నట్లు జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ తెలిపారు.

Pawan Kalyan
పవన్‌ కల్యాణ్‌
author img

By

Published : Jan 2, 2023, 7:23 PM IST

Janasena Yuvasakthi Meeting Poster Release : జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన యువశక్తి పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించనున్నట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా సభను నిర్వహించనున్నారు. స్వామి వివేకానంద జయంతి రోజున జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా.. జనసేన యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం యువత ఆలోచన, వారి కష్టాలను, భవిష్యత్​ను తెలియజేసేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి పవన్‌ గోడపత్రికను ఆవిష్కరించారు.

ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ

"ఈ నెల 12వ తేదిన స్వామి వివేకానందస్వామి జయంతి రోజున.. ఆయన స్పూర్తితోనే రణస్థలంలో యువశక్తి పేరుతో సభ ఏర్పాటు చేశాము. ఈ సభ ముఖ్య ఉద్దేశ్యం మన దేశానికి వెన్నెముక యువత. దేశానికి బలంలాగా ఉండాల్సిన యువత ఉపాధి పేరుతో వలస వెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా ఉంది. దీని గురించి యువతే వారి మాటల్లో చేప్పేలాగా ఈ కార్యక్రమం ఉండబోతుంది." -పవన్‌కల్యాణ్‌, జనసేన అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.