Pothina Mahesh comments on: బీసీ సంక్షేమంపై వైకాపా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై చర్చకు రావాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్.. ఆర్ కృష్టయ్యకు సవాల్ విసిరారు. బీసీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న జగన్ ప్రభుత్వానికి మద్ధతు పలకటంపై.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలకు సమాధానం చెప్పాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడాన్ని ఆర్ కృష్ణయ్య ఎందుకు ప్రశ్నించలేదంటూ మండిపడ్డారు. బీసీ సబ్ ప్లాన్, విదేశీ విద్య పథకాలను విస్మరించిన ప్రభుత్వంతో ఆర్ కృష్ణయ్య కలవటం దారుణమన్నారు. కృష్ణయ్య బీసీ దళపతి కాదు.. బీసీ దళారీగా చరిత్రలో నిలిచిపోనున్నారని పోతిన మహేశ్ మండిపడ్డారు.
ఇవీచదవండి: