ETV Bharat / state

Janasena Agitation: మంత్రి జోగి రమేశ్‌ వ్యాఖ్యలపై జనసేన ఫైర్​.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలు - Minister Jogi Ramesh

Janasena Agitation against Minister Jogi Ramesh: పవన్‌ కల్యాణ్‌పై.. మంత్రి జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసనకు యత్నించిన జనసేన నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు. జోగి రమేశ్ దిష్టిబొమ్మ దహనానికి జనసేన నాయకులు యత్నించగా.. పోలీసులు అడ్డుకుని వారిని అరెస్టు చేశారు. జోగి రమేశ్‌ నోరు పారేసుకున్నా.. జగన్‌ అదుపు చేయకపోవడంపై మండిపడ్డారు.

Janasena Agitation
జనసేన ఆందోళన
author img

By

Published : Jul 25, 2023, 7:15 PM IST

మంత్రి జోగి రమేశ్‌కు వ్యతిరేకంగా జనసేన ఆందోళన

Janasena Agitation against Minister Jogi Ramesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై.. మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. విజయవాడ పటమట ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద జోగి రమేశ్ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పవన్‌ కల్యాణ్‌పై మంత్రి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళవారం నాడు.. గుంటూరు జిల్లా వెంకటపాలెం సభలో మంత్రి జోగి రమేశ్ నోరు పారేసుకున్నా ముఖ్యమంత్రి అదుపు చేయకపోవడాన్ని తప్పుపట్టారు. జోగి రమేశ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు నిలువరించడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

"పవన్ కల్యాణ్ గురించి విమర్శిస్తే.. ముఖ్యమంత్రి ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. స్థాయిని దాటి మాట్లాడుతున్నారు. పవన్ కల్యాణ్​పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు". - అమ్మిశెట్టి వాసు, జనసేన రాష్ట్ర కార్యదర్శి

Janasena Leaders Protest against Jogi Ramesh Comments: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్​పై మంత్రి జోగి రమేశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరులో జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. జోగి రమేశ్ చిత్రపటాన్ని జనసేన వీరమహిళలు చెప్పులతో కొడుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, జనసేన నేతలకు మద్య తోపులాట నెలకొంది. జనసేన నాయకులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవి వదిలిపెడితే జనసేన సత్తా చూపుతామంటూ కార్యకర్తలు హెచ్చరించారు.

అవినీతి చిట్టా మొత్తం ఉంది..: మంత్రి రమేశ్ష్ అవినీతి చిట్టా మొత్తం తమ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దగ్గర ఉందని.. జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రేడ్డి రామకృష్ణ తెలిపారు. త్వరలోనే రమేశ్ అవినీతి చిట్టా మొత్తం.. పవన కల్యాణ్ బయటపెడతారని చెప్పారు. పెళ్లిళ్ల గురించి మాట్లాడటం కాకుండా పెడన నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లలో ఏం చేయలేదని.. కనీసం ఈ 6 నెలలు అయిన ఏదైనా అభివృద్ధి చేసి చూపించాలని అన్నారు. ప్రభుత్వ సమావేశంలో సీఎంతో కలిసి వ్యక్తిగత వ్యాఖ్యలు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదని ఆయన మండిపడ్డారు.

మంత్రి జోగి రమేశ్ పిచ్చి వ్యాఖ్యలు చేస్తుంటే సీఎం జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెడనకు ఏదో మంచి చేస్తావు అని జోగి రమేశ్​ను ప్రజలు ఎన్నుకుంటే.. చేసింది ఏమీ లేదని విమర్శించారు. మడ అడవులు నాశనం చేయటం, చెరువులు తవ్వటంలో లక్షల వసూలు చేశారని ఆరోపించారు.

మంత్రి జోగి రమేశ్ అమ్మాయిలను లోబర్చుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను కూడా వదలడం లేదని పేర్కొన్నారు. మంత్రి జోగి రమేశ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తోలు తీస్తామని హెచ్చరించారు. పవన్ కల్యాణ్​పై ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తే పెడనలో తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతకాక ఈ పిచ్చి ప్రేలాపనలంటూ మండిపడ్డారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.