ETV Bharat / state

ఇస్కాన్ టెంపుల్​లో కన్నుల పండువగా జగన్నాథ రధోత్సవం - Andhra Pradesh Latest News

ISKCON temple: ఇస్కాన్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జగన్నాథ రధోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. రథోత్సవంలో రథాన్ని లాగే అవకాశాన్ని నిర్వహకులు చిన్నారులకు కల్పించారు. నాలుగు సంవత్సరాల నుంచి విజయవాడ నగరంలో రథోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఈ సారి పిల్లలకు అవకాశం ఇవ్వాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామని ఇస్కాన్ విజయవాడ శాఖ మేనేజర్ వేణుధారి కృష్ణదాస్ తెలిపారు.

ISKCON temple
ఇస్కాన్ టెంపుల్​లో కన్నుల పండువగా జగన్నాథ రధోత్సవం
author img

By

Published : Jan 14, 2023, 4:28 PM IST

Updated : Jan 14, 2023, 4:59 PM IST

ఇస్కాన్ టెంపుల్​లో కన్నుల పండువగా జగన్నాథ రధోత్సవం

ISKCON temple: సంక్రాంతి పండుగ సందర్భంగా ఇస్కాన్ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో జగన్నాథ రధోత్సవం కన్నుల పండువగా జరిగింది. రథోత్సవంలో రథాన్ని లాగే అవకాశాన్ని నిర్వహకులు చిన్నారులకు కల్పించారు. నేడు భోగి పర్వాదినాన్ని పురస్కరించుకుని ఇస్కాన్ మందిరంలో భోగి మంటలు వేశారు. ఆనంతరం దేవేరులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. చిన్నారులు స్వామివారి రథోత్సవం సందర్భంగా అలపించిన గీతాలు, చేసిన నృత్యాలు భక్తులను ఎంతగానో అకట్టుకున్నాయి.

జగన్నాథుడిని కీర్తిస్తూ చిన్నారులు రథాన్ని ముందుకు లాగారు. ఇస్కాన్ దేవాలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర రామలింగేశ్వర నగర్​లోని ప్రధాన వీధుల్లో కొనసాగింది. చిన్నారులు రథాన్ని లాగుతుండగా స్థానికులు, భక్తులు వారి వెంటనడిచారు. నాలుగు సంవత్సరాల నుంచి విజయవాడ నగరంలో రథోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఈ సారి పిల్లలకు అవకాశం ఇవ్వాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామని ఇస్కాన్ విజయవాడ శాఖ మేనేజర్ వేణుధారి కృష్ణదాస్ తెలిపారు.

నాలుగు సంవత్సరాల నుంచి విజయవాడ నగరంలో రథోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం పెద్ద వారికి అవకాశం దొరుకుతుంది. కాని ఈ సారి పిల్లలకు అవకాశం ఇవ్వాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టాము.- వేణుధారి కృష్ణదాస్, ఇస్కాన్ విజయవాడ శాఖ మేనేజర్

ఇవీ చదవండి:

Last Updated : Jan 14, 2023, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.