ETV Bharat / state

సమస్యలకు నిలయంగా జగనన్న కాలనీలు-మౌలిక సదుపాయాలు కల్పించాలని లబ్ధిదారుల విజ్ఞప్తి - సమస్యలకు నిలయంగా జగనన్న కాలనీలు

Jagananna Colony Beneficiaries Facing Problems: ఇళ్లు కాదు ఊళ్లు నిర్మిస్తున్నామని సీఎం జగన్ పదే పదే చెబుతున్నా ఆచరణలో అది కనిపించడం లేదు. ఇళ్ల నిర్మాణం సరే అక్కడికి వెళ్లాలంటేనే లబ్ధిదారులు ఆపసోపాలు పడుతున్నారు. లబ్ధిదారుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తక్షణం రహదారులు, కాల్వలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

Jagananna_Colony_Beneficiaries_Facing_Problems

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 2:03 PM IST

Jagananna Colony Beneficiaries Facing Problems : ఇళ్లు కాదు ఊళ్లు నిర్మిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో అది కనిపించడం లేదు. ఇళ్ల నిర్మాణం సరే అక్కడికి వెళ్లాలంటేనే ఎంతో సమస్యగా మారిందంటున్నారు లబ్ధిదారులు. దారీతెన్నూలేని ప్రాంతంలో కాలనీలు నిర్మిస్తున్న అధికారులు లబ్ధిదారుల కోసం మురుగు కాల్వలు, రహదారులు నిర్మించలేదు. ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి శివారు శాంతినగర్-ఈలప్రోలులో జగనన్న కాలనీకి వెళ్లే రహదారులు మరింత అధ్వానంగా ఉన్నాయి.

YSRCP Government Careless on Jagananna Colonies : జిల్లాలోని కొండపల్లి శివారు శాంతి నగర్-ఈలప్రోలు జగనన్న కాలనీకి దారి లేక లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ లేఅవుట్లో 1605 వరకు ప్లాట్లకు గాను చివరి ప్రాంతంలో ఉన్న ప్లాట్లకు వెళ్లేందుకు అధికారులు రహదారిని అభివృద్ధి చేస్తామని గతంలో చెప్పారు. ఇంతవరకూ ఆ పనులు చేయకపోవడంతో బేస్ మట్టం వరకు వేసిన ఇళ్లతో పాటు ఖాళీ ప్లాట్లలోకి వరద నీరు వచ్చి చేరింది. లేఅవుట్లో రహదారులు బురదమయంగా మారాయి. అరకొరగా ఉన్న రహదార్లు సైతం తుపాను దాటికి దెబ్బతినడంతో లబ్ధిదారుల పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏ మూలకూ చాలక జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు కొందమంది లబ్ధిదారులు వెనుకంజ వేస్తున్నారు.

చిన్నపాటి వర్షాలకే చెరువులను తలపిస్తున్న కాలనీలు - లబ్ధిదారులు లబోదిబో

YSR Jagananna Colonies Situation in AP : ఇంటి పనులు చేసుకునేందుకు అక్కడికి వెళ్లాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు. కొన్నిచోట్ల ఇళ్ల పునాదుల వరకు నీరు చేరింది. దారి లేక పునాదులు వేసేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంతో లేఅవుట్లో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు మాత్రమే వేసి ఇతర పనులు చేయకపోవడంతో విద్యుత్ వసతి సమకూరలేదు. రాత్రయితే చాలు ఎవరూ ఉండేందుకు అవకాశం లేదు. వర్షాకాలమైతే చాలు కాలనీ బురదమయంగా మారుతుందని, గృహ నిర్మాణ సామగ్రిని తీసుకు వచ్చేందుకు సైతం వీలుపడటం లేదని స్థానికులు చెబుతున్నారు.

Lack of Facilities in Jagananna Colonies: జగనన్న కాలనీలో కష్టాలెన్నో.. కనీస వసతులు లేకుండా దారుణమైన దుస్థితి..

Jagananna Colonies Incomplete Due to Financial Problems in Kondapally : కొండపల్లి పట్టణ వాసులకు ఈలప్రోలు శివారులో జగనన్న కాలనీ స్థలాలు ఇచ్చారు. తాగేందుకు కూడా నీరు దొరకడం లేదు. కొండపల్లి వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఎంతో ఆశతో వచ్చామని కనీస సదుపాయాలు లేవని లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. ప్రాథమిక దశలోనే పనులుండగా, మౌలిక సదుపాయాలు ఇక్కడ సమకూరడానికి చాలా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కాలనీలో ప్రభుత్వం రహదారులు, కాల్వలు, తాగు నీరు వంటి కనీస వసతులు కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Jagananna Colony Houses Pending : ఇళ్లు కాదు ఊళ్లు నిర్మిస్తామని పదే పదే గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం జగనన్న కాలనీల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. లబ్ధిదారుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తక్షణం రహదారులు, కాల్వలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

ఏళ్లు గడుస్తున్నా ముందుకు సాగని జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు - నరకయాతన అనుభవిస్తున్న లబ్ధిదారులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.