ETV Bharat / state

'సాయం చేస్తుందనుకుంటే.. మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది'

author img

By

Published : Jan 15, 2023, 9:57 AM IST

AP Housing Scheme: ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి స్థలం పొందడంతో లబ్ధిదారుల్లో కలిగిన ఆనందం వాటిలో నిర్దేశిత గడువులోగా ఇంటిని కట్టుకోవాలన్న లక్ష్యంతో ఆవిరైంది. అంతంతమాత్రం ఆర్థిక పరిస్థితులలో బతుకీడుస్తున్న పేదలను ప్రభుత్వం, అధికారుల ఒత్తిళ్లు తీవ్ర ఆందోళనలోకి నెట్టేశాయి. పట్టా పోతుందనే భయంతో అప్పులు చేసే పరిస్థితికి దిగజార్చాయి. సాయం చేస్తుందని ఆశించిన ప్రభుత్వం మరిన్ని కష్టాల్లోకి నెట్టేసిందని లబ్ధిదారులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.

jagananna colonies
jagananna colonies
లబ్దిదారులపై ఒత్తిడి ఉగాదిలోపు జగనన్న ఇళ్లు కట్టకపోతే.. ఇక అంతేనటా..!

AP Housing Scheme: ''నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు'' పథకం పేదవారిపై పిడుగుపాటులా మారింది. స్థలం కేటాయించగానే నెమ్మదిగా ఇళ్లు నిర్మించుకుందామని ఆశపడ్డ లబ్ధిదారులకు ప్రభుత్వ నిర్ణయం షాక్‌నిచ్చింది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలన్న ప్రభుత్వ ధోరణితో పేదలకు అష్టకష్టాలు తప్పడం లేదు. ఉగాది నాటికి 5 లక్షల గృహాలు పూర్తికావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టడంతో దాన్ని అందుకునేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు లబ్ధిదారులపై ఒత్తిడి పెంచుతున్నారు. వారిని ఇళ్ల వద్దే కలిసి మాట్లాడుతున్నారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయంలోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, గృహ నిర్మాణ శాఖ, ఏఈ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎమ్ పీడీఓ లు, పంచాయతీ కార్యదర్శులు ఇలా విడతలవారీగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళుతూ వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇళ్లు కట్టుకోకుంటే పట్టా రద్దు చేస్తామంటూ హెచ్చరికలకు దిగుతుండటంపై లబ్ధిదారుల్లో ఆందోళన పెరుగుతోంది.

ఉగాదికి గడువు: పేదలందరికీ ఇళ్లు పథకం కింద మొదటి విడతగా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టగా ఇప్పటివరకు 2.20 లక్షల గృహాలు పూర్తయ్యాయి. ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లక్షా 80 వేల రూపాయలతోనే రాష్ట్రప్రభుత్వం సరిపెట్టింది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు, నిర్మాణ సామగ్రి ధరలు, విపరీతంగా పెరగడంతో లక్షా 80 వేల రూపాయలతో నిర్మాణాన్ని చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. గత ఏడాది డిసెంబర్‌ 21 నాటికే 5 లక్షల ఇళ్లు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించినా అది సాధ్యం కాలేదు. తాజాగా గడువును ఈ ఉగాదికి ప్రభుత్వం పొడిగించింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఇళ్లు కట్టించి లబ్ధిదారులకు తాళం చేతికి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించడంతో ఎక్కువ మంది ప్రభుత్వమే కట్టి ఇస్తుందనే భావనలో ఉన్నారు. అందుకే ఇప్పుడు అధికారులు ఒత్తిడి చేయడంపై లబ్ధిదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

లబ్ధిదారులపై ఒత్తిడి: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో రెండు రోజుల క్రితం లబ్ధిదారులతో గృహ నిర్మాణ శాఖ అధికారులు సమావేశాన్ని నిర్వహించి ఇళ్లు కట్టుకోకపోతే పట్టా రద్దు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఇళ్లు కట్టించి తాళాలు ఇస్తామని మొదట చెప్పి ఇప్పుడు తామే కట్టుకోవాలని ఒత్తిడి చేస్తే ఎలాగని పలువురు లబ్ధిదారులు మండిపడ్డారు. వైయస్సార్ జిల్లా ముద్దనూరు మండలంలోనూ ఇళ్ల నిర్మాణం చేపట్టకుంటే పట్టా రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వమే కట్టించి ఇచ్చే సంఖ్యను క్షేత్రస్థాయిలో అధికారులు కుదించి 3.25 లక్షలకు పరిమితం చేశారు. గుత్తేదారులు కట్టే ఈ ఇళ్ల నిర్మాణాలూ నత్తనడకనే సాగుతున్నాయి.

900 మేస్త్రీ ఆడకూలీ 500 ఇలా ఇద్దరు ముగ్గురు పనివాళ్లు వస్తే వారికి కూలీ ఇచ్చుకోవడం రోజుకు 3000 అవ్వుతుంది. ప్రస్తుతానికి 2 లక్షల 50 వేలు అప్పు చేశాము. ఎస్టీమేషన్ వేసుకోనీ సింపుల్ గా కట్టుకుంటే 10 లక్షలు అవ్వుతుంది. -లబ్దిదారురాలు

డబ్బులు లేక వడ్డీకి తెచ్చాం. కట్టకపోతే పట్టాలు తీసుకుంటామనీ జడిపిస్తున్నారు. మీరు ముందు కట్టి చూపించండి తరువాత డబ్బులు ఇస్తామనీ అంటున్నారు. ఏదో ఒకటి బాధ పడి కట్టాలి కదా. ఇల్లు లేనివాళ్లం ఏమీ చేస్తాం కట్టుకుంటున్నాం- లబ్దిదారురాలు

అప్పులు తెచ్చి గృహ నిర్మాణం: ప్రభుత్వం, అధికారుల ఒత్తిడితో ఆందోళనకు గురవుతున్న లబ్ధిదారులు కొందరు పట్టా పోతుందనే భయంతో ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టారు. అయితే పెరిగిన ఇంటి నిర్మాణం సామగ్రి ధరలు, కూలీలు వారికి కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే లక్షా 80 వేల రూపాయలు పునాది, బేస్‌మెంట్‌ వరకూ చాలడం లేదని వాపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ గృహ నిర్మాణం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా కాలనీల్లో రోడ్లు, నీరు, విద్యుత్‌ వంటి కనీస సౌకర్యాలను ప్రభుత్వం కల్పించకపోవడంతో వారి అవస్థలు, ఖర్చులు రెట్టింపవుతున్నాయి. దీనికి తోడూ నిర్మాణ సామగ్రి చోరీకి గురవుతుండటం లబ్ధిదారులను మరింత కలవరానికి గురిచేస్తోంది. పనులు మానుకుని రాత్రీపగలూ అక్కడే కాపలా కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సహాయం: కేంద్ర ప్రభుత్వమిచ్చే సాయానికి అదనంగా రాష్ట్రప్రభుత్వం కూడా అందజేస్తేనేకానీ ఇళ్ల నిర్మాణం పూర్తికాదని లబ్ధిదారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.