ETV Bharat / state

గుడివాడ క్యాసినో వ్యవహారం.. టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన ఐటీ శాఖ - గుడివాడ క్యాసినోపై ఈడీకి టీడీపీ ఫిర్యాదు

IT Notices to Varla Ramaiah: గుడివాడ క్యాసినో అంశంపై కొడాలి నాని, వంశీలపై సీబీడీటీ, ఈడీ, డీఆర్ఐ, కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలకు ఇప్పటికే టీడీపీ ఫిర్యాదు చేయగా.. ఫిర్యాదుపై స్పందించిన ఐటీ శాఖా సమాచారం సేకరణలో భాగంగా వర్ల రామయ్యను పిలిచింది. క్యాసినో విషయంలో తమ వద్దనున్న సమాచారం అందించాల్సిందిగా వర్ల రామయ్యకు ఐటీ నోటీసులు జారీ చేసింది.

IT notices to Varla Ramaiah
వర్ల రామయ్యకు ఐటీ నోటీసులు
author img

By

Published : Dec 15, 2022, 5:26 PM IST

IT Notices to Varla Ramaiah: గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. టీడీపీ ఫిర్యాదులపై స్పందించిన ఐటీ శాఖ.. తమ వద్దనున్న సమాచారం అందించాల్సిందిగా వర్ల రామయ్యకు నోటీసులిచ్చింది. కొడాలి నాని, వల్లభనేని వంశీల నేతృత్వంలో గుడివాడలో క్యాసినో నిర్వహించారని టీడీపీ ఆరోపణలు చేసింది. గుడివాడ క్యాసినో అంశంపై కొడాలి నాని, వంశీలపై సీబీడీటీ, ఈడీ, డీఆర్ఐ, కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలకు ఇప్పటికే టీడీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ ఫిర్యాదుపై స్పందించిన ఐటీ శాఖ సమాచారం సేకరణలో భాగంగా ఈ నెల 19వ తేదీన హాజరై.. సమాచారమివ్వాలని వర్ల రామయ్యకు సూచించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.