IPS Officers Promotions: రాష్ట్రంలో పలు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి లభించింది. సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్, అమిత్‌గార్గ్, మహేష్‌దీక్షిత్‌లకు డీజీపీ స్థాయి హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం పీవీ.సునీల్‌కుమార్ సీఐడీ ఏడీజీగా, అమిత్‌గార్గ్, మహేష్‌దీక్షిత్‌లు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు మహేష్‌చంద్రలడ్డాకు ఏడీజీగా పదోన్నతి లభించింది. శ్యాంసుందర్, త్రివిక్రమ్‌వర్మ, బాలరాజులకు ఐజీగా.. కోయా ప్రవీణ్, భాస్కర్‌భూషణ్, అమ్మిరెడ్డిలకు డీఐజీలుగా పదోన్నతిని ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీపికాపాటిల్, కృష్ణారావు, అమిత్‌బర్దార్‌లకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్లుగా పదోన్నతి లభించింది.
ఇవీ చదవండి: