Indrakeeladri Sharan Navaratri Utsavalu 2023: విజయవాడ కనకదుర్గ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా 3 రోజు కనకదుర్గమ్మ అన్నపూర్ణా దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టి మానవాళి ఆకలి దప్పులను తీర్చే తల్లి అన్నపూర్ణా దేవి రూపంలో దర్శనమిచ్చి భక్తుల్లో పారవశ్యాన్ని నింపుతోంది.
ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు సైతం అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందుతారనేది ప్రతీతి. దసరా ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవిగా ఉన్న దుర్గమ్మను.. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ శాఖల అధికారులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక కుంకుమార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. తెల్లవారుజాము 4 నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. శ్రీచక్రార్చన, కుంకుమార్చనలు, చండీహోమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు.
Indrakeeladri Navaratri Utsavalu: దసరా శరన్నవరాత్రి వేడుకలలో రెండవ రోజు శ్రీగాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. తొలి రోజు అధికంగా భక్తులు రావడంతో కట్టుదిట్టంగా లైన్లలో ఏర్పాట్లు చేశారు. ఈనెల 23వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుంచే అమ్మవారి దర్శనం కలిస్తున్నట్లు ఆలయ శాఖ అధికారులు తెలిపారు.
Vijayawada Navaratri Celebrations 2023: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు బాలాత్రిపురసుందరీదేవి అలంకరణలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల మొదటి రోజు కలశ స్థాపన, స్నపనాభిషేకం తర్వాత అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అమ్మవారి దర్శనానికి తొలి రోజు నుంచే లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. తొలిరోజే సుమారు లక్షన్నర మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
Kanaka Durga Temple Navaratri Utsavalu: విజయవాడలో ప్రతీ సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే దసరా ఉత్సవాలలో.. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 23వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. మరోవైపు తొలి రోజు నుంచే భక్తులు భారీగా తరలి వస్తుండటంతో.. ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు.