రాష్ట్రంలో మొదటి సారిగా ఇండోర్ రోయింగ్ పోటీలను విజయవాడ కానూరులోని కేసీపీ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ జిల్లాల నుంచి 75 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సబ్ జూనియర్ స్థాయి నుంచి మాస్టర్స్ స్థాయి వరకు అన్ని విభాగాల్లో పోటీలు నిర్వహించారు . రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించిన ఆటగాళ్లకు నవంబరులో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశముందని అమరావతి బోటింగ్ క్లబ్ ఛైర్మన్ తరుణ్ కాకాని తెలిపారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. రోయింగ్ అంటే నదులపై పడవలతో పోటీయేనని అందరికీ తెలుసు.. ఇండోర్లో కూడా ఇలా పోటీలు జరుగుతాయని ఇప్పుడే తెలిసిందని పలువురు క్రీడాభిమానులు చెబుతున్నారు. ఇటువంటి పోటీలు క్రీడాకారుల్లో స్ఫూర్తిని పెంచుతాయన్నారు.
ఇవీ చదవండి: