ETV Bharat / state

TDP Complaint: యర్రగొండపాలెం ఘటనపై గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు - యర్రగొండపాలెం రాళ్ల దాడి ఘటన వార్తలు

TDP leaders Complaint to Governor on YCP Attacks: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహనంపై గతవారం యర్రగొండపాలెంలో జరిగిన రాళ్ల దాడి ఘటనపై.. ఆ పార్టీ ముఖ్య నేతలు నేడు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భాగంగా మంత్రి సురేశ్, పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియోలను గవర్నర్‌కు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు.. పలు కీలక విషయాలను వెల్లడించారు.

TDP Complaint
TDP Complaint
author img

By

Published : Apr 26, 2023, 8:30 PM IST

Updated : Apr 26, 2023, 9:52 PM IST

TDP leaders Complaint to Governor on YCP Attacks: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు వాహనంపై నాలుగు రోజులక్రితం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై టీడీపీ ముఖ్య నేతలు ఈరోజు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో భాగంగా ఆరోజు మంత్రి సురేశ్, పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియోలను సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు.. కీలక విషయాలను వెల్లడించారు.

చంద్రబాబుపై 11 సార్లు దాడికి పాల్పడ్డారు.. టీడీపీ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పర్యటనలను వైఎస్సార్సీపీ అడ్డుకుంటున్న విధానంపై విచారణ కమిటీ వేయాలని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌‌ను కోరామన్నారు. యర్రగొండపాలెంలో చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని రాళ్ల దాడి చేసిన ఘటన విధానాన్ని గవర్నర్‌కు వివరించామన్నారు. ఇప్పటికే తమ పార్టీ అధినేతను లక్ష్యంగా చేసుకుని.. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు 11 సార్లు దాడులు సృష్టించారని.. ఆ ఘటనలకు సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు వివరించి, వీడియోలను కూడా అందచేశామన్నారు.

యర్రగొండపాలెం ఘటనపై గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు

వీధి రౌడీలా ప్రవర్తించిన ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలి.. అనంతరం మంత్రి సురేశ్ యర్రగొండపాలెంలో చొక్కా విప్పిన వీడియోను మీడియా ముందు ప్రదర్శించారు. వీధి రౌడీలా ప్రవర్తించిన మంత్రి సురేశ్‌ని వెంటనే బర్తరఫ్ చేయాలని తెలుగుదేశం ముఖ్య నేతలు డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని గవర్నర్‌తో చర్చించగా.. మంత్రి సురేశ్‌పై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు నేతలు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ సభలు, కార్యక్రమాలపై పోలీసుల సహకారంతో అధికార పార్టీ దాడులు చేస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. యర్రగొండపాలెం ఘటన, ఎన్ఎస్జీ కమాండోకు గాయాల అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రతిపక్షాలపై దాడులు చేసేందుకు రాష్ట్ర పోలీసులను వాడుకుంటున్న అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

వైసీపీ మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనలో మంత్రి సురేశ్ చొక్కాను టీడీపీ నేతలు చింపారంటూ కొందరు వైఎస్సార్సీపీ మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు వైఫల్యం చెందాయని గవర్నరుకు వివరించామన్నారు. సామాజిక లబ్ది పొందే ప్రక్రియలో భాగంగానే యర్రగొండపాలెం ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ చెప్పినట్టు చొక్కా విప్పిన మంత్రి సురేశ్ తలెక్కడ పెట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసలు ఏం జరిగిదంటే.. గతవారం (శుక్రవారం) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పర్యటనలో రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడిలో భాగంగా అప్రమత్తమైన చంద్రబాబు భద్రతా సిబ్బంది వారి వద్దనున్న బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లను వెంటనే చంద్రబాబు నాయుడికి అడ్డు పెట్టి, ఆయనకు రక్షణగా నిలబడ్డారు. దీంతో ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌ సంతోష్‌ కుమార్‌ తలకు రాళ్లు తగిలి గాయాలయ్యాయి. మరోవైపు ఘటన సమయంలో వైఎస్సార్సీపీ మంత్రి సురేశ్, రాాళ్ల దాడి వెనుక చంద్రబాబే ఉన్నాడంటూ ఎదురు దాడికి దిగారు. ఈ ఘటన సమయంలో.. మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్న అడుగగా.. దానికి ఆయన సమాధానం చెప్తూ.. టీడీపీ నేతలు ఎంత మందితో వస్తారో రండి చూస్తానంటూ ఆవేశంగా నల్ల చొక్కా విప్పి సవాల్‌ చేశారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 26, 2023, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.