ETV Bharat / state

విజయవాడలో అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్.. చికిత్సలపై 50శాతం తగ్గింపు

Akkineni Womens Hospital Latest Treatment updates: 11 ఏళ్లు నిండిన మహిళలు వ్యాక్సిన్ తీసుకుంటే సర్వైకల్ కాన్సర్‌ను అరికట్టవచ్చని.. అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ డైరెక్టర్ డా.మణి తెలిపారు. విజయవాడలోని నూతన ఆసుపత్రిలో మహిళలకు అన్ని రకాల చికిత్సలను 50 శాతం తగ్గింపుతో అందిస్తున్నామని ఆమె వెల్లడించారు.

Akkineni Womens
Akkineni Womens
author img

By

Published : Apr 6, 2023, 7:32 PM IST

Akkineni Womens Hospital Latest Treatment updates: 11 ఏళ్లు నిండిన మహిళలు వ్యాక్సిన్ తీసుకుంటే సర్వైకల్ కాన్సర్‌ను అరికట్టవచ్చని.. అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ డైరెక్టర్ డా.మణి అన్నారు. మహిళలకు పూర్తి స్థాయిలో చికిత్సను ఒకేచోట అందించేందుకు విజయవాడలో మరో ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నూతన ఆసుపత్రిలో మామోగ్రఫీ, ఐవీఎఫ్, డెర్మిటాలజీలో నాణ్యమైన చికిత్స అందించేందుకు అత్యాధునిక పరికరాలను ప్రారంభించమన్నారు. యూరినల్ సమస్యలను అరికట్టేందుకు ఎంసెల్లా చైర్‌పై చికిత్స అందిస్తామని ఆమె పేర్కొన్నారు.

విజయవాడలో అక్కినేని నూతన ఆసుపత్రి ప్రారంభం: ఈ సందర్భంగా ఈటీవీ భారత్‌తో మాట్లాడుతూ..''మహిళలకైనా, పురుషులకైనా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే ఒక్కో సమస్యకు ఒక్కొక్క ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇకపై మహిళలకు ఏ చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎటువంటి వైద్య సేవలు అవసరమైనా.. ఒకేచోట చికిత్సను అందించేందుకు విజయవాడలో నూతనంగా అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్‌లో ఏర్పాటు చేశాం. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులో ఉంచాము. ఆసుపత్రిలో.. ఐవీఎఫ్, డెర్మిటాలజీ, ఎంసెల్లా చెైర్ ట్రీట్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించాం. ఈ ఆసుపత్రిని ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ డీసీపీ మేరి ప్రశాంతి, డా.వైఎస్సాఆర్ హెల్త్ వర్శిటీ రిజిస్ట్రార్ డా.రాధికా రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.మంజుల, డా.తరుణ్ జైన్‌లు నూతన విభాగాలను ప్రారంభించటం సంతోషంగా ఉంది. మొత్తం 12 రకాల పరికాలను నూతనంగా అందుబాటులోకి తెచ్చాము. ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో పెరుగుతున్న సర్వైకల్, రొమ్ము కాన్సర్స్‌ను తగ్గించాలంటే ముందస్తుగా పరీక్షలు చేయించుకోవటం కీలకం. 11 ఏళ్లు నిండిన బాలికలు సర్వైకల్ కాన్సర్స్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ తీసుకోవచ్చు.'' అని ఆమె అన్నారు.

తక్కువ ఖర్చుతో రొమ్ము కాన్సర్ వైద్యం: అనంతరం రొమ్ములో గడ్డలు ఏర్పడేకంటే ముందే మామోగ్రఫీ లాంటి పరీక్షలు చేయించుకుంటే కూడా కాన్సర్స్‌ను గుర్తించవచ్చన్నారు. రొమ్ము కాన్సర్స్‌ను గుర్తించేందుకు ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అత్యాధునిక మామోగ్రఫీ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి ఒక్క మహిళకు నాణ్యమైన ఆరోగ్యం అందించటమే తమ లక్ష్యమని.. తక్కువ ఖర్చుతోనే వైద్య చికిత్స అందిస్తున్నామని డా.మణి తెలిపారు.

ఎంసెల్లా చైర్‌‌తో యూరినల్ సమస్యకు వైద్యం: మహిళలు యూరినల్ (మూత్ర విసర్జన) సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారని.. అటువంటివారికి ఎంసెల్లా లాంటి పరికరం అద్భుతంగా పనిచేస్తుందని.. పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. మంజుల అన్నారు. ఎంసెల్లా చైర్ ట్రీట్‌మెంట్ సెంటర్‌ను విజయవాడలో ప్రారంభించటం ఆనందంగా ఉందన్నారు. తెలియకుండానే యూరిన్ వచ్చే సమస్యతో బాధపడుతున్న వాళ్లు బయటకు రాలేకపోతున్నారని.. ఇకపై అలా భయపడాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. ఎంసెల్లా చైర్‌పై సెషన్‌కు అరగంట చొప్పున ఆరు సెషన్స్ కూర్చుంటే ఆ సమయంలో వైబ్రేషన్ ద్వారా కండరాలు బలోపేతం అవుతాయని.. దీంతో యూరినల్ సమస్య 95శాతం తగ్గుతుందని ఆమె తెలియజేశారు.

50శాత తగ్గింపుతో ఐయుఐ, ఐవీఎఫ్ చికిత్స: పెళ్లైన జంటలు సంతానలేమితో బాధపడుతున్న వారికి 50శాతం తగ్గింపుతో ఐయుఐ, ఐవీఎఫ్ చికిత్స అందిస్తున్నామని.. ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డా.సౌమ్య అన్నారు. ఐవీఎఫ్ కేంద్రం ద్వారా సంతానలేమితో బాధపడుతున్న దంపతులకి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామని తెలిపారు. అనంతరం అధునాతన చికిత్స పద్ధతుల ద్వారా చర్మ సౌందర్యం పెంచుకోవచ్చని.. డా.ప్రవీణ అన్నారు. ఒకే చోట అన్ని రకాల సమస్యలకు చికిత్స అందించే ఆసుపత్రి అందరికీ అందుబాటులోకి సంతోషంగా ఉందని పలువురు తెలిపారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.