ETV Bharat / state

Soil Mafia in AP: ఆగని అక్రమ మట్టి తవ్వకాలు.. అంతా మా ఇష్టం అంటున్న అధికార పార్టీ నేతలు - telugu news

Illegal Soil Mining in NTR District: ఎన్ని విచారణలు జరిగితేం. ఎన్ని కేసులు నమోదైతేం.. ఎన్ని నోటీసులు జారీ చేస్తేనేం.. మమ్మల్ని ఆపేదెవరు..? అన్నట్లు మట్టి మాఫియా చెలరేగిపోతోంది. గనుల శాఖ నుంచి నోటీసులు అందుకున్న వైసీపీ నాయకులు ఇంకా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. వాటికి తాత్కాలిక అనుమతులు అంటూ తీసుకోవడం మరో కీలక పరిణామం.

Sand Mining in NTR District
Sand Mining in NTR District
author img

By

Published : May 8, 2023, 7:27 AM IST

Illegal Soil Mining in NTR District: విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు తాడేపల్లి సమీపంలోని అస్సైన్‌మెంటు భూముల్లో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. గనులశాఖ నోటీసిచ్చినా లెక్కచేయడం లేదు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో రెచ్చిపోతున్నారు. మట్టి తరలిస్తున్న లారీలను కొత్తూరు తాడేపల్లి గ్రామానికి చెందిన కొంతమంది అడ్డుకున్నా.. చంపేస్తామంటూ బెదిరించి తీసుకెళ్తున్నారు.

ఎన్ని విచారణలు జరిగితేనేం. ఎన్ని కేసులు నమోదైతేనేం.. ఎన్ని నోటీసులు జారీ చేస్తేనేం.. మమ్మల్ని ఆపేదెవరు అన్నట్లు కొత్తూరు తాడేపల్లిలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. గనుల శాఖ నుంచి నోటీసులు అందుకున్నప్పటికీ.. వైకాపా నాయకులు మట్టి తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. తాత్కాలిక అనుమతులంటూ.. పర్యావరణ, కాలుష్య నియంత్రణ శాఖల అనుమతులు లేకుండానే రెవెన్యూ, గనులశాఖల్ని అడ్డం పెట్టుకుని తవ్వేస్తున్నారు. విజయవాడ బైపాస్ నాలుగో ప్యాకేజీకి గ్రావెల్ తరలిస్తున్నారు. అయితే వీరు పాత్రధారులు మాత్రమే నని.. వీరి వెనుక పెద్దలు ఉన్నారని స్థానికులు అంటున్నారు.

Soil Mafia in Andhra Pradesh: ఎన్టీఆర్​ జిల్లా కొత్తూరు తాడేపల్లిలో ఇప్పటికే 150 ఎకరాలకు పైగా విస్తీర్ణం, అటవీ స్థలంలో 200 కోట్ల రూపాయల విలువైన మట్టి తరలించారని అంచనా. గనుల శాఖ సుమారు 59 ఎకరాల్లో 6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలించారని నివేదించింది. గనుల శాఖ నివేదిక తర్వాత కూడా మట్టి తవ్వుతూనే ఉన్నారు. దీనిపై పిల్లి సురేంద్రబాబు జాతీయ హరిత ట్రైబ్యునలకు ఫిర్యాదు చేయడంతోపాటు హైకో ర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు రెండుసార్లు కమిటీ పర్యటించగా వాటికీ మట్టి మాఫియా అడ్డంకులు సృష్టించింది.

ఎసైన్డ్ భూముల్లో.. మట్టిమాఫియా మరోసారి రెచ్చిపోయి తవ్వకాలు జరుపుతోంది. ఈ భూముల్లో తాత్కాలిక అనుమతులు తీసుకున్నట్లు చెబుతున్నారు. పేదలు సాగు చేసుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పంచిన ఎసైన్డ్ భూముల్లో..... మట్టి తవ్వకాలకు అధికారులు ఎలా అనుమతిచ్చారనేది అనుమానాలకు తావిస్తోంది. ఎన్జీటీ కమిటీ పర్యటించిన తర్వాత కూడా.... రెవెన్యూ అధికారులు ఎసైన్డు భూముల్లో తవ్వకాలకు అనుమతులివ్వడం చర్చనీయాంశమైంది.

"ఆదివారం మధ్యాహ్నం రిజర్వు ఫారెస్టు వైపు వెళితే చాలా లారీలు, రెండు జేసీబీలు కనిపించాయి. అనుమతులు అడిగితే.. మీకెందుకు చూపెట్టాలని ప్రశ్నించారు. మా గ్రామంలో అక్రమ తవ్వకాలు ఏమిటని ప్రశ్నిస్తే చంపుతామని బెదిరించారు. అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవ్వరూ రాలేదు. ఎన్జీటీ బృందం పరిశీలించిన ప్రాంతంలోనే ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి. సోమవారం దీనిపై స్పందనలో ఫిర్యాదు చేస్తాం"-జములయ్య, కొత్తూరు తాడేపల్లి

అక్రమ మట్టి తవ్వకాల వెనుక అధికార పార్టీ నేతలే ఉన్నారని కొత్తూరు తాడేపల్లి వాసులు చెబుతున్నారు. ఆదివారం నాడు లారీలు అడ్డిగించి అధికారులకు సమాచారమిచ్చినా ఎవ్వరూ రాలేదని ఆరోపిస్తున్నారు. భారీ ఎత్తున తవ్వకాలు కనిపిస్తుంటే.. తమ భూముల్లో తవ్వకాలు లేవని అటవీ అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.