Houses Incomplete in YSR Jagananna Colonies : ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నా.. ఆచరణలో మాత్రం రాష్ట్రంలో ఎక్కడ కన్పించడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం (YSRCP Government) ఇచ్చే నిధులు ఏ మూలకూ చాలకపోవడం, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడంతో లబ్ధిదారులు వెనుకంజ వేస్తున్నారు. ఆర్థిక చేయూత అందిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఆచరణ రూపం దాల్చకపోవడంతో పనులు మందగించాయి. ఎన్టీఆర్ జిల్లా మెలవరం నియోజకవర్గంలో చాలామంది లబ్ధిదారులు గృహ నిర్మాణ పనులు పునాధులకే పరిమితం చేశారు.
YSRCP Government Careless on Jagananna Colonies : జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలోని మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ గ్రామీణ మండల గ్రామాల పరిధిలో తొలి విడతగా జగనన్న కాలనీల పేరిట పక్కా గృహాలను మంజూరు చేశారు. రెండో దశలో రెడ్డి గూడెం మండలంలో అనుమతులు ఇచ్చారు. సుమారు 20వేల మందికి పట్టాలివ్వగా.. సొంత స్థలమున్న 3వేల మంది వరకు అనుమతులు ఇచ్చారు. ప్రభుత్వ ఒత్తిడితో ఎలాగోలా ప్రారంభించి.. తర్వాత మధ్యలోనే వదిలేశారు.
Jagananna Colonies Beneficiaries Facing Problems In NTR District : మెలవరం నియోజకవర్గంలో 16వేల 920 ఇళ్లకు అనుమతులు ఇవ్వగా... పునాదుల దశలో 8వేల 811 ఇళ్లున్నాయి. పూర్తైనవి 4వేల 24 ఇళ్లు కాగా.. వివిధ దశల్లో మరో 4వేల 658 ఇళ్లున్నాయి. సొంత నిధులు వెచ్చించుకోలేని వారికోసం గుత్తేదారులను ఏర్పాటు చేస్తే పురోగతి ఉంటుందని భావించిన అధికారులు.. ఊరగుట్ట, జి.కొండూరు మండలంలోని ఓ గ్రామంలో లబ్ధిదారుల నుంచి కొంత మొత్తం తీసుకున్నారు. 30వేల వరకు తీసుకున్నా ఆయా ప్రాంతాల్లో పనులు పునాదులు దాటలేదని, నిర్మాణాలు మధ్యలోనే ఆగాయని డబ్బులు చెల్లించిన వారు మొత్తుకుంటున్నారు. వూరగుట్ట, చంద్రాల, కొండపల్లి మున్సిపాల్టీలో ఏడాది కిందట నుంచే నిర్మాణాలు మందగించాయి.
Floods In Jagananna Colonies: నీట మునిగిన జగనన్న కాలనీలు.. చెరువుల కన్నా దారుణం.
Houses Incomplete in Jagananna Colonies Due to Financial Problems in Mylavaram : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇస్తున్న లక్షా 80 వేల రూపాయలతో సగం ఇల్లు కూడా పూర్తికావడం లేదని, దానికి అదనంగా 4 లక్షల నుంచి 7 లక్షల వరకు పైగా అప్పులు చేయాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. అయినా తంటాలు పడుతూ కొంతమంది పూర్తి చేసుకోగా.. అప్పులు చేయలేనివారు పునాదుల దశలోనే ఆపేశారని అధికారులే అంగీకరిస్తున్నారు. మరోవైపు మెరక చేయడానికి గ్రావెల్ ఖరీదుగా మారడంతో మరింత అదనపు భారమవుతోందని లబ్ధిదారులు అంటున్నారు. మరోవైపు కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరత వేధిస్తుంది. రహదారులు, కాల్వలు లేకపోవడంతో రాకపోకలు ఇబ్బందికరంగా మారాయి.
Jagananna Colony Houses Pending : నిర్మాణాలు ప్రారంభించిన ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని చెబుతున్న అధికారులు.. ఆగిపోయిన ఇళ్లను మళ్లీ ఆరంభించడానికి చర్యలు చేపట్టడం లేదు. కాలనీల్లో సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని లబ్ధిదారులు వేడుకుంటున్నారు.
Jagananna Colonies సీఎం జగన్ శంకుస్థాపన చేసిన జగనన్నకాలనీ పరిస్థితి ఇది..!