ETV Bharat / state

ఇసుక మైనింగ్​కు హైకోర్టు ఆంక్షలు - ఇసుక మైనింగ్​కు ​ఎన్​ఓసీ

High Court on Illegal Sand Mining : రాష్ట్రంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్​ పై హై-కోర్టు ఆంక్షలు విధించింది. పర్యావరణ అనుమతులు, ఎన్​ఓసీ (No Objection Certificate) లేని నేపథ్యంలో టెండర్​ను ఎవరికీ అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తామని ఓ దశలో ధర్మాసనం స్పష్టంచేసింది.

Etv Bharathigh_court_on_illegal_sand_mining

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 7, 2023, 10:13 AM IST

High Court on Illegal Sand Mining : కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నుంచి పర్యావరణ అనుమతులు, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నిరభ్యంతర పత్రం పొందకుండా రాష్ట్రంలో ఇసుక రీచ్​లలో తవ్వకాలు చేపట్టడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. పర్యావరణ అనుమతులు, ఎన్​ఓసీ (NOC) లేని నేపథ్యంలో టెండర్​ను ఎవరికీ అప్పగించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తామని ఓ దశలో ధర్మాసనం స్పష్టంచేసింది.

అధికార పార్టీ నేతల ఇసుక దందా - పోలీసులు పట్టించుకోకపోవడంతో అడ్డుకున్న టీడీపీ, జనసేన

NOC For Sand Mining : పర్యావరణ అనుమతులు, ఎన్​ఓసీ (No Objection Certificate) లేకుండా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. టెండర్ ప్రక్రియ ద్వారా ఇసుక తవ్వకాలకు అనుమతి పొందిన కాంట్రాక్ట్ ఏజన్సీలకు ఇప్పటికే లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీచేశామని, అయినప్పటికీ పర్యావరణ అనుమతులు, ఎన్​ఓసీ (NOC) పొందాకే తవ్వకాలకు అనుమతిస్తామని రాష్ట్రప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ కోర్టుకు వివరించారు. ఏజీ ఇచ్చిన హామీని న్యాయస్థానం నమోదు చేసింది.

సినీఫక్కీలో ఇసుక లారీని వెంబడించిన మంత్రి ఎస్కార్ట్ వాహనం - ఢీకొట్టడంతో కలకలం

HC Rules For Sand mining : ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు, ఎన్​ఓసీ (NOC) తప్పనిసరి అని గుర్తుచేసింది. ఇసుక తవ్వకాలపై రాష్ట్రప్రభుత్వం, జయప్రకాశ్ వెంచర్స్, టర్నీకీ సంస్థలకు తామేమి క్లీన్ చిట్ ఇవ్వడం లేదని వ్యాఖ్యానించింది. మరోవైపు రాష్ట్రంలోని ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై సమాంతరంగా తాము విచారణ జరపడం సరికాదని అభిప్రాయపడింది. అక్రమ తవ్వకాల వ్యవహారాన్ని ఎన్​జీటీ (National Green Tribunal) దృష్టికి తీసుకెళ్లేందుకు పిటిషనర్​కు వెసులుబాటు ఇచ్చింది.

టెండర్లు ఖరారు కాకుండానే ఇసుక తవ్వకాలు - టెండర్ పెట్టింది సీఎంవోనా?

NGT In Sand Mining : ఎన్​జీటీ లో పిటిషన్ వేసిన వ్యక్తే ప్రస్తుతం పిల్ దాఖలు చేశారని గుర్తుచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పిల్​ను పరిష్కరించింది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాల లీజు గడువు ఈ ఏడాది మే 2తో ముగిసినా జయప్రకాశ్ పవర్ వెంచర్స్, టర్న్​కీ ఎంటర్ ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు అక్రమంగా ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నాయని పేర్కొంటూ పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోటకు చెందిన దండా నాగేంద్రకుమార్ హైకోర్టులో పిల్ వేశారు. ఇసుక తవ్వకాల్లో ఉల్లంఘనలు పరిశీలించి నివేదిక ఇచ్చేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ టెండర్ ప్రక్రియను రద్దు చేయాలని అభ్యర్థించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.

ఇసుకలో 'దోచుకో, పంచుకో, తినుకో'.. తవ్వకాలపై పెదవి విప్పని ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.