HC Hearing Tomorrow on SI Recruitment Process Petition: ఎస్సై ఉద్యోగాలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్ట్) రేపు విచారణ జరపనుంది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు అభ్యర్థులు, బోర్డు అధికారులు తమ ఎదుట హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Candidates petition in HC on SI Appointments: ఎస్సై నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు ఇటీవలే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎత్తు అంశంలో తమకు (అభ్యర్థులు) అన్యాయం జరిగిందని, గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని అభ్యర్థులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. బాధితుల తరఫున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ గతంలో అర్హులైన వారు, ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. నియామక ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని కోర్టును కోరారు. దాంతో న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం ఎస్సై నోటిఫికేషన్‌పై స్టే విధించింది.
ఎస్‌ఐ నియామక ప్రక్రియపై హైకోర్టులో విచారణ - అభ్యర్థులంతా హాజరు కావాలని ఆదేశం
State Government Petition in Division Bench: ఈ నేపథ్యంలో ఎస్సై నియామకాల విషయంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఎస్సై అభ్యర్థులకు ఎత్తు అంశంలో అన్యాయం జరగలేదని ప్రభుత్వం తరుఫున న్యాయవాది కోర్టుకు వివరించారు. 45వేల మంది యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని న్యాయస్థానం స్టేని ఎత్తివేయాలని కోర్టును కోరారు. ఈ మేరకు ఎత్తు కొలతల ప్రక్రియకు సంబంధించిన వీడియోగ్రఫీని న్యాయవాది కోర్టుకు అందించారు.
'ఎస్‌ఐ నోటిఫికేషన్'పై హైకోర్టు స్టే - పిటిషనర్ తరఫు న్యాయవాది ఏమన్నారంటే!
Height Measurement Process in Presence of Judge: అయితే, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. హైకోర్టు నియమించే బృందం సమక్షంలోనే అభ్యర్థులకు తిరిగి ఎత్తు కొలుస్తామని పేర్కొంది. ఈ క్రమంలో అభ్యర్థులు తప్పుడు ఆరోపణలు చేసినట్టు నిరూపితమైతే ఒక్కో అభ్యర్థికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. ఎంతమంది కోర్టుకు హాజరవుతారో తెలపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్‌కు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
High Court Orders For Candidates, Board Officers: ఎస్సై నియామక ప్రక్రియ పిటిషన్‌పై దాఖలైనా పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరపనున్న నేపథ్యంలో జడ్జి సమక్షంలో ప్రభుత్వ వైద్యుడితో అభ్యర్థుల ఎత్తు కొలిచే ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటలకు అభ్యర్థులు, బోర్డు అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.