ETV Bharat / state

ప్రజలకు మేలు‌ చేసే మనసు లేదా.. వైసీపీని ప్రశ్నించిన జీవీఎల్​

BJP MP GVL Comments on YSRCP : వైసీపీ ప్రభుత్వం చేతకానితనంతో, నిర్లక్ష్య ధోరణిలో ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్​ నరసింహారావు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. ఏపీలో ప్రత్యామ్నయం బీజేపీ, జనసేనతోనే అని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం సాధించారో చెప్పాలని ప్రశ్నించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 12, 2023, 1:41 PM IST

BJP MP GVL Narasimha Rao : నాలుగేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ‌పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎంపీ జీవీఎల్​ నరసింహారావు విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని‌ దుస్థితికి ప్రభుత్వం వచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ పరిణామాలకు భవిష్యత్తులో‌ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రానికి అవసరమైన నిధులను కేంద్రం ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చినా.. వైసీపీ ప్రభుత్వం చేతకాని తనంతో నిర్లక్ష్య ధోరణిలో ఉందని అగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడో కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులకు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు సహాయం అందడం లేదని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి మంచి చేసే మనసు లేదా : రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవా.. లేక ప్రజలకు మేలు‌ చేసే మనసు లేదా అని ప్రశ్నించారు. కనీస బాధ్యత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఏపీకి 7 వేల కోట్లు అదనపు సాయం లభించినా.. అభివృద్ధి చేయడం లేదన్నారు. జగన్​కు రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొట్టే పరిస్థితి ఉందన్నారు. గతంలో టీడీపీని కుట్టిన పురుగే.. ఇప్పుడు వైసీపీని కుట్టినట్లు ఉంది. ప్రజా వ్యతిరేకతను కేంద్రంపై నెట్టేద్దామని‌ చూస్తున్నారని విమర్శించారు. వినాశకాలే‌ విపరీత బుద్దులు అన్నట్లుగా.. టీడీపీ తరహాలో‌ వైసీపీ దెబ్బ తినడం ఖాయమని జోస్యం చెప్పారు. వైసీపీ ఎంపీలు అబద్దాలు మాట్లాడుతూ.. వారి‌ చేతకాని తనం బయట పెట్టుకున్నారన్నారు. వారి చేతకాని తనం వల్లే రాష్ట్రంలో ప్రాజెక్టులు నిరుపయోగంగా మారాయని ఎద్దేవా చేశారు.

ఇంతవరకు ఏం సాధించారో చెప్పే దమ్ముందా : ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు కేంద్రం ఏపీకి ఇచ్చిందని.. విశాఖతో సహా అనేక పారిశ్రామిక వాడల అభివృద్ధి వైసీపీ ఎంపీలకు పట్టదని ఆరోపించారు. రేపు సమ్మిట్​లో మీ చేతకానితనం అని‌ చెప్పుకుంటారా అని ప్రశ్నించారు. ఉన్న ప్రాజెక్టులను కూడా తరిమేశామని చెప్పుకోగలరా అని ప్రశ్నల వర్షం కురిపించారు.. అబద్దాలను ప్రచారం చేయడం మాని.. ప్రజలకు మేలు‌ చేయండని అన్నారు. గతాన్ని‌ గుర్తు చేసుకోండని.. మాపై బురద జల్లితే మేము ఉపేక్షించేది లేదని జీవీఎల్​ హెచ్చరించారు. 2018లో టీడీపీ ఎంపీలు ఏం‌ మాట్లాడారో.. ప్రస్తుతం వైసీపీ ఎంపీలు కూడా అదే క్యాసెట్ వినిపిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్​లో ఏదో మాట్లాడి మార్కులు కొట్టేద్దాం అనుకుంటే ఎలా అన్నారు. ఈ ఐదేళ్లలో ఏం సాధించారో చెప్పే దమ్ము వైసీపీ ఎంపీలకు ఉందా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ‌ వైఫల్యాలను ప్రశ్నిస్తూ.. మా‌ నుంచి విమర్శల దాడి ఉంటుందని తెలిపారు.

ఏపీలో ప్రత్యామ్నయం జనసేనతోనే : రాష్ట్రంలో ముందు‌ చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యిలా ఉందన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు మాయమాటలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. టీడీపీ తరహాలో వైసీపీ కూడా వచ్చే ఎన్నికలలో దెబ్బ తినడం ఖాయమని పేర్కోన్నారు. ఏపీలో ప్రత్యామ్నాయం బీజేపీ, జనసేనతోనే సాధ్యమని అన్నారు. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలను మళ్లీ అధికారంలోకి తెచ్చే ఆలోచన ప్రజలకు లేదన్నారు. ఎవరి కోసమే మేము పని‌ చేయమని.. జన సైనికులు ఇదే కోరుతున్నారని తెలిపారు. వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని.. టీడీపీ లేచే పరిస్థితి లేదని విమర్శించారు. నారా లోకేష్ పాదయాత్రతో టీడీపీకి ఉన్న గ్రాఫ్ కూడా పడిపోయిందని అన్నారు. లోకేష్ యాత్ర పూర్తిగా కొనసాగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. 2024 ఎన్నికలలో జనసేన, బీజేపీ కలిసి అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మళ్లీ పోరు యాత్ర : మార్చి పది తరువాత బీజేపీ పోరు యాత్రతో మళ్లీ ప్రజల్లోకి‌ వెళతామని తెలిపారు. సోము‌ వీర్రాజు ఆధ్వర్యంలో తొలి‌విడత పోరు యాత్రకు మంచి స్పందన వచ్చిందని వెల్లడించారు. ఈసారి ప్రజలను మరింత పోరుయాత్రలో భాగస్వామ్యం చేస్తామని అన్నారు. ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల్లో కూడా పోరు యాత్ర చేయాలని అధిష్టానం నిర్ణయించిందని పేర్కొన్నారు. కాపుల విషయంలో టీడీపీ, వైసీపీలు మోసం చేశాయని విమర్శించారు. కాపుల రిజర్వేషన్ పేరుతో కేంద్రానికి పంపించమని చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. ఏపీలో కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందనేది వాస్తవమన్నారు. వైయస్, చంద్రబాబు, జగన్ ముగ్గురూ కాపులకు ద్రోహం‌ చేసిన వారేనని.. అంతా కేంద్రం పరిధిలో ఉందంటూ ప్రజలను మభ్య పెట్టారని అన్నారు.

బీజేపీ ఎంపీ జీవీఎల్​ నరసింహారావు

"వైసీపీ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్​లో చీ కొట్టే పరిస్థితి వచ్చింది. 2018లో తెలుగుదేశాన్ని కుట్టిన పురుగే.. మళ్లీ వైసీపీని కూడా కుట్టినట్లుగా ఉంది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, భరత్​ వాళ్ల చేతకాని తనన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ మెట్రోకు ఎందుకు అనుమతి ఇవ్వలేదు.. బెంగుళూరుకు ఇచ్చారు, మేము దీనిపై గళమెత్తుతాం అని వైసీపీ ఎంపీలు అంటున్నారు. ఇచ్చిన ప్రాజెక్టులకు దిక్కు లేదు. అనుమతి లభించి నిర్మాణంలో ఉన్నవి వైసీపీ చేతకాని తనం వల్ల ఆగిపోతున్నాయి. స్కామ్​లకు, భూ దోపిడిపై ఉన్న శ్రద్ధ పారిశ్రామిక నగరాలకు కట్టే వాటి పైన లేదు." - జీవీఎల్​ నరసింహరావు, బీజేపీ ఎంపీ

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.