Gunadala Mary Mata Festival: విజయవాడలోని గుణదల మేరీ మాత ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రారంభమైన ఉత్సవాలు రేపు, ఎల్లుండి కూడా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. 99వ సంవత్సరం జరుగుతున్న ఈ గుణదల మేరీ మాత ఉత్సవాలు.. గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ కారణంగా ఆగిపోయాయని.. ఈ ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశాలు ఉన్నాయని మత పెద్దలు తెలిపారు.
ఉత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో సుమారు 900 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రతిష్టాత్మకమైన గుణదల మేరిమాత ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు.
ఇవీ చదవండి: