ETV Bharat / state

అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వ చర్చలు విఫలం - సమ్మె ఉద్ధృతం, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి! - Negotiations Between Anganwadi and Government

Govt Negotiations With Anganwadi Workers Failed : అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వేతనాలు పెంచేందుకు కొంత సమయం కావాలని మంత్రుల కమిటీ అంగన్వాడీలను కోరింది. సంక్రాంతి తర్వాత దీనిపై మరోమారు చర్చిద్దామని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదనతో అంగన్వాడీలు విభేదించారు. ప్రభుత్వం ఓ పక్క బుజ్జగిస్తూ మరోపక్క బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె కొనసాగుతుందని తేల్చి చెప్పారు. నేడు ఎమ్మెల్యేల నివాసాల వద్ద నిరసనలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు.

Govt_Negotiations_With_Anganwadi_Workers_Failed

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 27, 2023, 9:34 AM IST

అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వ చర్చలు విఫలం - సమ్మె ఉద్ధృతం, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి!

Govt Negotiations With Anganwadi Workers Failed : సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో నాల్గోసారీ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రస్తుతం వేతనాలు పెంచే పరిస్థితిలో సర్కారు లేదని చర్చల్లో మంత్రుల కమిటీ తేల్చి చెప్పింది. గ్రాట్యుటీ అమలు కోసం కోర్టు ఉత్తర్వులు తెచ్చుకోవాలని అంగన్వాడీలకు సూచించింది. సంక్రాంతి తర్వాత మరోమారు ఈ అంశంపై చర్చిద్దామని మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ జవహర్ రెడ్డి ప్రతిపాదించారు.

నా అక్కాచెల్లెమ్మలు అంటూ ముద్దులతో ముంచెత్తిన జగన్ హామీలను గాలికొదిలేశారు: అంగన్వాడీలు

సమ్మెవిరమించాలని కోరారు. లేకుంటే ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి ఉంటుందని అంగన్వాడీలకు స్పష్టం చేసినట్లు మంత్రి బొత్స వెల్లడించారు. ఇప్పటికే గర్భిణులు, పిల్లలకు బాలామృతం అందడం లేదన్నారు. వేతనాలు పెంచాలనే ఒక్క డిమాండ్ మినహా అన్నింటినీ ఆమోదించామన్నారు. సమ్మె వీడి విధుల్లో చేరాలని కోరినట్లు మంత్రి తెలిపారు.

Anganwadis Talks with YCP Government : సమ్మె ఉద్ధృతం చేయనున్నట్లు అంగన్వాడీ సంఘాల నాయకులు ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సీఐటీయూ, ఏఐ టీయూసీ, ఐఎన్టీయూ అనుబంధ సంఘాల నేతలతో, మంత్రుల బృందం చర్చలు విఫలమయ్యాయి. ప్రధాన డిమాండ్లయిన వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలుపై పీటముడి వీడలేదు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు పరిష్కరించాలి - లేకపోతే సమ్మెను ఉద్ధృతం చేస్తాం: అంగన్వాడీ కార్యకర్తలు

అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే జనవరి 3న కలెక్టరేట్లను దిగ్బంధిస్తామని తేల్చిచెప్పారు. వారి ప్రధాన డిమాండ్లపై సచివాలయంలో మంత్రుల బృందం సుమారు గంటన్నరపాటు చర్చించింది. మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆర్థిక, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు చర్చల్లో పాల్గొన్నారు.

Negotiations Between Anganwadi and Government : అంగన్వాడీలపై ప్రభుత్వం కక్ష గట్టే వేతనాలు పెంచడం లేదని ఆయా సంఘాల నేతలు మండిపడ్డారు. చర్చల్లో సర్కారు ప్రతిపాదనలను మూకుమ్మడిగా తిరస్కరించినట్లు వెల్లడించారు. ఓ పక్క బుజ్జగిస్తూ మరోపక్క బెదిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ తమ డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లలేదని మంత్రి బొత్స చెప్పడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు పెంచడానికే ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవా అని ధ్వజమెత్తారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. నేడు శాసనసభ్యుల నివాసాల వద్ద నిరసనలకు దిగనున్నట్లు ప్రకటించారు.

ప్రభుత్వం కావాలనే అంగన్వాడీలను వేధిస్తోందని గుర్తింపు సంఘాల నేతలు మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు అంగన్వాడీలకు మద్దతుగా ఉంటామన్నారు. ఉద్యమం ఉద్ధృతం కాకుండా ఉండాలంటే వెంటనే ముఖ్యమంత్రి జగన్‌ వేతన పెంపు ప్రకటన చేయాలని అంగన్వాడీల నేతలు డిమాండ్‌ చేశారు.

అక్కాచెల్లెళ్లంటూనే నడిరోడ్డుపై నిలబెట్టారు - అంగన్వాడీల ఆవేదనపై నోరు మెదపని జగనన్న

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.