Republic Day celebrations at Vijayawada: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఇందులో జాతీయజెండాను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, హాజరయ్యారు. పోలీసు దళాల నుంచి గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. ఆర్మీ, ఏపీఎస్పీ, ఒడిశా పోలీస్ గౌరవ వందనం చేశారు. అనంతరం గవర్నర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముక వ్యవసాయం అని గవర్నర్ పేర్కొన్నారు. 10 వేలకు పైగా రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. పంటకు మద్దతు ధర అందించి రైతులకు అండగా నిలబడి.. రైతు కుటుంబాలకు ఏటా రూ.13,500 సాయం చేస్తున్నామని చెప్పారు. 37 లక్షలమంది రైతులకు వైఎస్‌ఆర్ పంటలబీమా అమలు చేస్తున్నామన్నారు.
నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరిగిందన్నారు. జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందుతోందని తెలిపారు. విద్యార్థులు చదువుకునేందుకు అన్ని విధాలుగా సాయపడుతున్నామని.. విద్యా కానుక ద్వారా ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు సాయం అందుతోందని చెప్పారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ట్యాబ్లు అందించామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో త్వరలో సంచార పశువైద్య క్లినిక్‌లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో 11 బోధనా ఆస్పత్రులు నిర్మిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 17 వైద్యకళాశాలలు వస్తున్నాయని.. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని అన్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్య బాధ్యతలు తీసుకున్నామని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ పింఛను కానుక ద్వారా రూ.2,750 సాయం అందిస్తున్నామని తెలిపారు. వైఎస్‌ఆర్ ఆసరా కింద పేద మహిళలకు ఏటా రూ.15 వేల సాయం.. కాపు నేస్తం ద్వారా ఇప్పటివరకు రూ.1,518 కోట్ల సాయం అందించామని చెప్పారు.
శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి: ముఖ్యమంత్రి జగన్.. గణతంత్ర దినోత్సవాన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర భారత దేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. దేశ అభ్యున్నతికి కృషి చేద్దామని.. రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకుందామని ట్వీట్ చేశారు.
-
స్వతంత్ర భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుంటూ వారి బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దాం. #RepublicDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">స్వతంత్ర భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుంటూ వారి బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దాం. #RepublicDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2023స్వతంత్ర భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుంటూ వారి బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దాం. #RepublicDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2023
ఇవీ చదవండి: