ETV Bharat / state

తూతూమంత్రంగా పరీక్షలు.. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతున్న ప్రశ్నపత్రాలు - పాఠశాల విద్యార్థులకు సమ్మెటివ్‌ పరీక్షలు

Examinations for School Students: పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహిస్తున్న పరీక్షల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తేటతెల్లమవుతోంది. ప్రశ్నపత్రాలు పరీక్షలకు ముందే సామాజిక మాధ్యమాల్లో దర్శనం ఇవ్వడమే దీనికి నిదర్శనం. దీనివలన విద్యార్థులు పూర్తిగా చదవకుండా.. కేవలం ప్రశ్నపత్రంలోని వాటిని మాత్రమే చదువుతున్నారు.

exams
పరీక్షలు
author img

By

Published : Jan 11, 2023, 9:11 AM IST

Examinations for School Students: పాఠశాలల్లో విద్యార్థులకు నిర్వహిస్తున్న పరీక్షలను ప్రభుత్వం సరిగా నిర్వహించలేకపోతోంది. ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌ల ప్రశ్నపత్రాలు పరీక్షలకు ముందే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడం సాధారణంగా మారిపోయింది. దీంతో చాలా మంది విద్యార్థులు కేవలం ఆ ప్రశ్నపత్రంలోని వాటినే చదివేసి రాసేస్తున్నారు. విద్యాహక్కు చట్టం-2009లో భాగంగా నిరంతర, సమగ్ర మూల్యాంకన(సీసీఈ) విధానాన్ని కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీన్ని రాష్ట్రంలో 2013 నుంచి అమలు చేస్తున్నారు.

ఏడాదికి నాలుగు పర్యాయాలు ఫార్మెటివ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. సీసీఈ నిబంధనల ప్రకారం వీటికి పాఠశాల స్థాయిలోనే ప్రశ్నపత్రాలను రూపొందించుకోవాలి. గతంలో ఇదే విధానాన్ని పాటించేవారు. ఇప్పుడు ఈ పరీక్షలకు సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రశ్నపత్రాన్ని అందిస్తున్నారు. గతంలో నిర్వహించిన ఈ పరీక్షల ప్రశ్నపత్రాలు ముందుగానే బయటకు వచ్చేశాయి. ఇప్పుడు నిర్వహించిన సమ్మెటివ్‌-1 పరీక్షల పరిస్థితి ఇలానే తయారైంది.

ఇవేం పరీక్షలు..?

రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెటివ్‌-1 పరీక్షలను ఈనెల 6 నుంచి 10 వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ప్రతి రోజూ యూట్యూబ్‌, వాట్సప్‌ల్లో ముందుగానే వస్తూ ఉన్నాయి. ప్రశ్నపత్రాలు లీకవుతున్నా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. తెలుగు ప్రశ్నపత్రం లీకేజీపై విశాఖ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరవాత కూడా ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వచ్చేసినా ఏం చేయలేక అధికారులు వదిలేశారు. సాంఘిక శాస్త్రం ప్రశ్నపత్రం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతంలో సామాజిక మాధ్యమాల్లోకి వచ్చేసింది. గణితం పేపర్‌ సైతం ముందుగానే బయటకు వెలువడింది

భారీగా ప్రజాధనం ఖర్చు..

ఫార్మెటివ్‌, సమ్మెటివ్‌ పరీక్షలకు ఉమ్మడి ప్రశ్నపత్రాలను వినియోగిస్తుండడంతో వీటి ప్రింటింగ్‌కు భారీగా వ్యయం చేయాల్సి వస్తోంది. ప్రింటర్లకు రూ.కోట్లలో చెల్లిస్తున్నారు. ఎస్‌ఎస్‌ఏ సకాలంలో నిధులు ఇవ్వకపోవడంతో ప్రింటర్లకు భారీగా బాకీలు పెడుతున్నారు. సుమారు. రూ.16కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. విద్యశాఖలోని ఓ అధికారి కమీషన్ల కోసమే ఉమ్మడి ప్రశ్నపత్రాల రూపకల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఒత్తిడి

సమ్మెటివ్‌-1 పరీక్షల ప్రశ్నపత్రాలను 24 గంటల్లోపు మూల్యాంకనం చేసి, ఆన్‌లైన్‌లో మార్కులు నమోదు చేయాలంటూ ఉపాధ్యాయులపై పాఠశాల విద్యాశాఖ ఒత్తిడి తీసుకొస్తోంది. లేకపోతే సస్పెన్షన్‌ వేటు వేస్తామని ప్రధానోపాధ్యాయులను ఆర్జేడీలు, డీఈఓలు బెదిరిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమ్మెటివ్‌ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. గురువారం నుంచి సంక్రాంతి సెలవులు ఉన్నాయి. బుధవారం సాయంత్రంలోపు మూల్యాంకనం ప్రక్రియ పూర్తిచేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నచోట పెద్ద సమస్య కాదని, ఐదారు వందల మంది పిల్లలు ఉన్నచోట ఎలాగని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.