ETV Bharat / state

ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం ఆమోదం - Education Minister Botsa Satyanarayana meeting

Government has approved the transfers of government teachers: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విజయవాడ సమగ్ర శిక్ష అభియాన్‌ కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘ నాయకులు సమావేశమయ్యారు. హేతుబద్దీకరణ, పాఠశాలల మ్యాపింగ్‌ కారణంగా నష్టపోతున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు విన్నవించారు. ఉపాధ్యాయులకు అదనపు పాయింట్లు ఇవ్వాలన్న సంఘాల విజ్ఞప్తికి అధికారులు ప్రాథమికంగా ఆమోదం తెలిపారు. ఉపాధ్యాయ షెడ్యూల్‌ను 2, 3 రోజులు పొడిగిస్తామని, బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తామనిమంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Government has approved the transfers of government teachers
ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం ఆమోదం
author img

By

Published : Dec 17, 2022, 9:29 AM IST

Updated : Dec 17, 2022, 10:24 AM IST

Government has approved the transfers of government teachers: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, ఇతర అంశాలపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. విజయవాడలోని సమగ్ర శిక్ష అభియాన్‌ కార్యాలయంలో సుమారు నాలుగు గంటలకు పైగా చర్చలు జరిపారు. రెండు సవరణలకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. హేతుబద్దీకరణ, పాఠశాలల మ్యాపింగ్‌ కారణంగా నష్టపోతున్న ఉపాధ్యాయులందరికీ అదనపు పాయింట్లు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. 2021లో బదిలీలు పొంది, ఇప్పుడు హేతుబద్దీకరణ, మ్యాపింగ్‌తో బదిలీకి గురవుతున్న వారికి పాత స్టేషన్‌ పాయింట్లు ఇవ్వాలని విన్నవించారు. వీటికి ప్రాథమికంగా అధికారులు ఆమోదం తెలిపారు. ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు స్టేషన్, సర్వీసు పాయింట్లు ఇవ్వాలని చర్చల్లో నాయకులు విన్నవించారు. ప్రతి ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు.

ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం ఆమోదం

బైజూస్‌ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని సీబీఎస్‌ఈ సిలబస్‌లో చరిత్ర వక్రీకరణలు జరుగుతున్నాయని యూటీఎఫ్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు విమర్శించారు. సీబీఎస్‌ఈపై సమగ్రంగా చర్చ జరగాలని అని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 2లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటే ఇందులో 140మందికి సిఫార్సు బదిలీలు చేస్తే అవి ఏ మాత్రమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నిర్వహించిన చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు. 140మంది బదిలీలను అదేదో భూతద్దంలో పెట్టి 1.40లక్షలు చేస్తున్నట్లు అడుగుతున్నారని దీనిపై ఏవరైనా నవ్వుతారని అన్నారు.

ఈ బదిలీల వల్ల ఉపాధ్యాయులకు నష్టమేమి లేదని ఎవ్వరు నష్టపోబోరని వెల్లడించారు. ఈ సిఫార్సు బదిలీలపై ఉపాధ్యాయ సంఘాల వారు ఎవ్వరూ అడగలేదని తనకు కూడా తెలియదంటూ ఈ అంశాన్ని ముగించారు. బదిలీల సవరణలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాల నాయకులు 10 అంశాలు అడిగారు. వాటిలో రెండు తీసుకున్నాం. ప్రతిది భూతద్దం పెట్టి చూద్దామంటే ఇది స్కాంలు, దోపిడీ కాదు. దయచేసి వాతావరణాన్ని కలుషితం చేయొద్దని మంత్రి కోరారు. ప్రజలకు లేని అనుమానాలు కల్పించొద్దని బదిలీల అంశాల్లో సవరణలను ప్రకటిస్తామని చెప్పారు. ప్రస్తుతం 1-10 తరగతి వరకు రాష్ట్ర సిలబస్‌ ఉందని వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లోనూ జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ను అమలు చేయాలని చర్చించామని దీనికి సంఘాల నాయకులందరూ ఆమోదం తెలిపారని అన్నారు.

బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి జిల్లాపరిషత్తు పాఠశాలలో ఈనెల 21న ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో ట్యాబ్‌లను సీఎం జగన్‌ అందిస్తారని మంత్రి బొత్స తెలిపారు. అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తారని అన్నారు. వారం రోజులపాటు విద్యార్థులకు అందించే కార్యక్రమం కొనసాగుతుందని మొత్తం 4.60లక్షల మంది విద్యార్థులు, 59వేల ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను అందించనున్నామని అన్నారు. ప్రతి ఏడాది ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తామని మూడేళ్ల తర్వాత విద్యార్థులకు ట్యాబ్‌లు సొంతమవుతాయని మంత్రి బొత్స వెల్లడించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 17, 2022, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.