ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా గుడ్​ ఫ్రైడే.. ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు

Good Friday : లోక రక్షణ కోసం యేసుక్రీస్తు సిలువకు బలయ్యాడని యేసుక్రీస్తు విశ్వాసులు నమ్ముతారు. లోక రక్షణ కోసం యేసు సిలువకు బలైనట్టుగా వారు భావిస్తారు. తమ కోసం యేసుక్రీస్తు లోక రక్షకుడై త్యాగం చేసిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకొంటారు. విశ్వాసులంతా గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేయబడిన క్రీస్తును స్మరించుకుంటారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Apr 7, 2023, 8:34 PM IST

Good Friday Celebrations : విజయవాడలోని సెయింట్ పాల్స్ కథెడ్రల్ చర్చి ప్రాంగణం నుంచి బహిరంగ సిలువ ప్రదర్శన నిర్వహించారు. పరిశుద్ధ సిలువ ప్రదర్శనను విజయవాడ కేథలిక్ డయోసిస్ బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, మోన్సిన్యోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్ ప్రారంభించారు. సెయింట్ పాల్స్ కథెడ్రల్ నుంచి మారిస్ స్టెల్లా కళాశాల ఆడిటోరియం వరకు సిలువ ప్రదర్శన సాగింది. అందరి బతుకులూ బాగుండాలని, అందరి పాపాలు పోవాలని యేసుక్రీస్తుని క్రైస్తవులు ప్రార్థించారు. యేసు క్రీస్తు మానవులందరి శ్రేయస్సు కోరుకున్నారని క్రైస్తవ మత పెద్దలు అన్నారు. ఈ సిలువ ప్రదర్శన కార్యక్రమంలో మహిళలు యువతీ యువకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

వైఎస్సార్​ కడపలో : కడపలో గుడ్ ​ఫ్రైడేని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ప్రజల కోసం ఏసుక్రీస్తు శిలువపై తన ప్రాణాలను అర్పించిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే పండగలో భాగంగా కడపలో పెద్ద ఎత్తున భక్తులు సిలువ మోస్తూ తమ భక్తిని చాటుకున్నారు. సిలువను మోసేందుకు భక్తులు పోటీపడ్డారు. మహిళా భక్తులు కూడా సిలువను మోశారు. దేవుని పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ సిలువ యాగ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు నిర్వహించారు. ఏసు పాపులను రక్షించుట కోసం సిలువపై మరణం పొందాడని బిషప్ విక్టర్ బాబు అన్నారు. తిరిగి మూడో రోజున ఏసుప్రభు సమాధిలో నుంచి లేస్తారని అప్పుడు ఈస్టర్ పండుగ జరుపుకుంటారని పేర్కొన్నారు.

అంబేడ్కర్​ కోనసీమ జిల్లా : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇరుసు మండలంలో ఆర్​సీఎం చర్చి ఆధ్వర్యంలో క్రైస్తవులు పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ప్రార్థన మందిరం నుంచి గ్రామంలోని వీధులలో క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ ప్రదర్శన జరిపారు. అంతకుముందు ఆర్​సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఎన్టీఆర్​ జిల్లాలో : ఎన్టీఆర్ జిల్లా మైలవరం క్రైస్తవులు గుడ్​ ఫ్రైడే సందర్బంగా సిలువ ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక క్రైస్తవులు పవిత్ర సిలువని పురవిధుల్లో ఊరేగింపు చేసి భక్తి గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో పలు క్రైస్తవ ఆరాధనా సంఘాల సభ్యులు, క్రైస్తవ సోదర, సోదరిమణులు భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. గన్నవరంలో గుడ్​ ఫ్రైడేని నిర్వహించారు. స్థానిక ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో బహిరంగ సిలువ మార్గం నిర్వహించారు. పట్టణంతో పాటు చెన్నై - కోల్​కతా హైవే మీదుగా క్రీస్తు మరణ ఘట్టాలను ప్రదర్శించారు. ఫాదర్ పసల థామస్ ఆధ్వర్యంలో భారీగా పాల్గొన్నారు. తేలప్రోలు, కొండపావులూరు, కేసరపల్లి, అజ్జంపూడి, ముస్తాబాదలో ఆకట్టుకున్న శుభ శుక్రవారం ప్రార్ధనలు నిర్వహించారు.

గోదావరి జిల్లాలో : పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో గుడ్ ​ఫ్రైడేని జరుపుకొన్నారు. లోక రక్షకుడైన యేసుక్రీస్తును శిలువ వేసిన రోజును పవిత్ర దినంగా విశ్వాసులు పండుగ నిర్వహిస్తారు. తణుకులో విశ్వాసులంతా సిలువ వేయబడిన క్రీస్తు రథం ముందు నడుస్తు భారీ ప్రదర్శన చేశారు. విశ్వాసులలో అధికమంది క్రీస్తు సిలువను చేత పట్టుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు.

నెల్లూరులో : గుడ్​ ఫ్రైడే వేడుకలను నెల్లూరులో నిర్వహించారు. నగరంలోని సుబేదారుపేటకు సమీపంలోని సెయింట్ జోసఫ్ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ ప్రార్ధనల్లో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఏసు ప్రభువును స్మరిస్తూ బిషప్ ఎండీ ప్రకాశం సిలువ మోశారు. ఈ కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని ఆయన సిలువ మోశారు.

కేంద్రపాలిత ప్రాంతమైన యానంలో : కేంద్ర పాలిత ప్రాంతం యానంలో క్రైస్తవులు గుడ్​ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. అతి పురాతన రోమన్ క్యాథలిక్ చర్చ్ ఫాదర్ మరియాదాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని క్రీస్తు యొక్క జీవిత ఘట్టాలను తలచుకొని దుఃఖమయమయ్యారు. ఈ సందర్భంగా యానం పురవీధుల్లో క్రీస్తు కీర్తనలు ఆలపిస్తూ ర్యాలీగా ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. భక్తులందరూ విశ్వాసంతో జీవించాలంటూ చర్చి ఫాదర్ మరియాదాస్ ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో క్రైస్తవులే కాకుండా అన్ని మతాలకు చెందిన వారు పాల్గొన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.