Fully Damaged Flyovers in Vijayawada: జగన్ ఏలుబడిలో రోడ్లపై సాఫీగా ప్రయాణం ఎలాగూ సాధ్యం కాదు.. కనీసం ఫ్లైఓవర్‌పైనైనా దూసుకుపోదామనుకుంటే నేరుగా నరకంలోకి వెళ్లినట్లే. పైవంతెనలు కట్టేస్తే చాలు.. అవి ఎలా ఉంటే తమకేంటి అనుకుంటారో ఏమో.. కనీసం ఎలా ఉన్నాయో.. ప్రయాణికుల అవస్థలు ఏంటో పట్టించుకోరు. నాలుగున్నరేళ్లుగా నిర్వహణకు నోచుకోక ఫ్లైఓవర్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. రహదారిపై ఇనుప ఊచలు పైకి లేచి ప్రమాదాలు జరుగుతున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి విజయవాడలోని పైవంతెనలే నిదర్శనం.
బెంబేలెత్తిపోతున్న ప్రయాణికులు: అడుగడుగునా గుంతలు.. రోడ్డుపై తారు పైకి లేచి బయటకు వచ్చిన ఇనుప ఊచలు.. దీనికి 'జగనన్న గుంతల పథకం' అని పేరు పెడితే సరిగ్గా సూటవుతుంది. విజయవాడ రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి నున్న, గొల్లపూడి బైపాస్ వైపు వెళ్లే మార్గంలోని రెండు పైవంతెనల పరిస్థితి అధ్వానంగా మారింది. వీటిపై నుంచి వెళ్లాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.
Damaged Roads in Guntur: "గుంటూరు గుంతల లోతు తెలియడం లేదు.. దేవుడిపైనే భారం వేశాం!"
పాలకులు కళ్లకు గంతల కట్టుకున్నారా..?: వంతెనలు శిథిలావస్థకు చేరి రహదారి ఛిద్రమైంది. భారీ గుంతలు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. పెద్దపెద్ద గుంతలు, కంకర తేలి ఇనుప ఊచలు పైకి నిక్కబొడుకొచ్చాయి. ఈ దారిలో ప్రయాణమంటేనే నరకప్రాయమే. వర్షమొస్తే పరిస్థితి మరీ దారుణం. నీరు నిలబడి గుంతలు ఎక్కడున్నాయో కూడా కనిపించవు. ప్రయాణికులు కిందపడిన ఘటనలూ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా పాలకులు కళ్లకు గంతలు కట్టుకున్నారు.
సీఎం సారుకు ఇవేవీ కనిపించడం లేదా..?: సీఎంకు ఇవన్నీ కనబడట్లేదా (Damaged Roads in Andhra Pradesh ) అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవును నిజమే ఎందుకు కనిపిస్తుంది.. ముఖ్యమంత్రి వర్యులేమో విలాసవంత హెలికాఫ్టర్లలో గాల్లో విహరిస్తారు.. ఆయనకు సామాన్యుల ప్రయాణ కష్టాలు ఎలా కానవస్తాయి. దీంతో చాలామంది ప్రయాణికులు ప్రమాదాల బారినపడ్డారు. ఈ దారిలో వస్తే.. బైక్‌లు, ఆటోలు, లారీలు.. ఇలా ప్రతీది షెడ్డుకు వెళ్లాల్సిందే. ఇనుప చువ్వలు గుచ్చుకుని.. టైర్లకు పంక్చర్లు పడుతున్నాయి. ఈ దెబ్బకు పెట్రోల్ ఛార్జీలు కూడా రావడం లేదని.. వాహనాల రిపేర్‌కు డబ్బులు సరిపోవట్లేదని ఆటో డ్రైవర్లు అంటున్నారు.
Damaged Roads: అధ్వానంగా రహదారులు.. బటన్ నొక్కు జగనన్నా..!
గుంతల రహదారిపై నరకయాతన: ఎప్పుడూ ఈ రహదారిలో ప్రయాణించని కొత్త ప్రయాణికులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ద్విచక్రవాహనదారులు గుంతల రహదారిపై నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ రహదారిపై నుంచి ఎప్పుడు బయటపడాతామా అనే ఆందోళనతో నిత్యం వాహనదారులు ప్రయాణిస్తారు. నగరానికి చుట్టుపక్క ప్రాంతాలకు వెళ్లాలన్నా ఇవే ప్రధాన వంతెనలు. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటాయి. ఇంతటి కీలకమైన ఫ్లైఓవర్ల నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు.
ROADS DAMAGE IN GUNTUR గుంటూరు గుంతల రోడ్లతో వాహనదారులకు తిప్పలు..