ETV Bharat / state

"వ్యవసాయ విద్యుత్ మోటార్లకు.. మీటర్లు వద్దే వద్దు" - ఎన్టీఆర్ జిల్లాలో రైతుల ధర్నా

Farmers protest: వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్ల పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా ఆధ్వర్యంలో రైతులు నిరసన తెలిపారు. మోటార్లకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నామని అంటూనే ముఖ్యమంత్రి జగన్​.. రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Farmers protest
నిరసన
author img

By

Published : Aug 6, 2022, 2:33 PM IST

Farmers protest: ఎన్టీఆర్​ జిల్లా చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో రైతులు.. విద్యుత్ మోటార్లను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టేందుకోసమని.. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పత్రాలు ఇవ్వాలని రైతులపై విద్యుత్​ శాఖ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యలను నిరసిస్తూ.. చింతలపాడు గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కోటా వీరబాబు తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. మోటార్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అంటూనే ముఖ్యమంత్రి జగన్​.. రైతులను మోసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సౌమ్య ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఉచిత విద్యుత్ ఇస్తామని, ఇప్పుడేమో బిల్లులు వసూలు చేయడానికి సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. వెంటనే ఈ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే.. పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.