Farmers are Facing Difficulties to Sell Vegetables: ఈ ప్రాంతంలో వివిధ రకాల కూరగాయలు పెద్ద సంఖ్యలో రైతులు సాగు చేస్తారు. వారు పండించిన పంటను అమ్ముకోవడానికి దగ్గరలో రైతుబజారు లేక అవస్థలు పడుతున్నారు. వారు పండించిన పంటను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ ప్రాంతంలో అనేక కూరగాయలు సాగవుతున్నా తమకు అందుబాటులో ఉండడం లేదని స్థానికులు చెబుతున్నారు. మూడేళ్లుగా ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాగణంలో కూరగాయలు అమ్ముకునే వాళ్లమని.. ఈ మధ్య కాలంలో కళాశాల అవసరాల నిమిత్తం తమను అక్కడ నుంచి ఖాళీ చేయంచారని రైతులు, చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గత్యంతరం లేక ఫుట్ పాత్‌పై కూరగాయలు అమ్ముతూ రైతులు, చిరువ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు.
Farmers Suffering Due to Lack of Irrigation Water: వరిపైరుకు అందని సాగునీరు.. అల్లాడుతున్న రైతులు
విజయవాడలోని కానూరు, తాడిగడప, పోరంకి ప్రాంతంలో రైతులు ప్రధానంగా తిండి గింజలతో పాటు వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. వారు పండించిన పంటను అమ్ముకోవడానికి సరైన బజారు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తమ కూరగాయలు అమ్ముకోవాడనికి అవకాశం ఉన్నా.. కొనే వారు ఉన్నా బజారు సౌకర్యం లేకపోవడంతో విక్రయాలు సరిగా జరగడం లేదని రైతులు, చిరువ్యాపారులు చెబుతున్నారు. కష్టబడి సాగు చేసిన కూరగాయలు ఫుట్‌పాత్‌పై ఎండలో అమ్మడం వల్ల పాడవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.
కానూరు, తాడిగడప ప్రాంతాల్లో రైతుబజారు అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లి కూరగాయలు కొనాల్సి వస్తోంది. సుమారు 40వేల మంది ఈ ప్రాంతంలో జీవిస్తున్నారు. ఇంత మంది జీవిస్తున్నా ఈ ప్రాంతంలో రైతు బజారు లేదు. కానూరు, తాడిగడప ప్రాంతాల్లో ఓ రైతు బజారుని నిర్మిస్తే తమకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలతో పాటు నిత్యవసర సరుకులు అందుబాటులోకి వస్తాయని స్థానికులు చెబుతున్నారు. కానూరులో మూడేళ్లుగా ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని సైకిల్ షెడ్లో కూరగాయలు విక్రయించేవాళ్లమని ఇప్పుడు తమను అక్కడ నుంచి ఖాళీ చేయించారని రైతులు చెబుతున్నారు. దీంతో వేరే మార్గం లేక ఫుట్ పాత్‌పై రైతులు, వ్యాపారులు కూరగాయలు అమ్ముతున్నారు.
Jeedi Farmers Problems: జీడి రైతు గుర్తున్నాడా.. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. ముఖ్యమంత్రి గారూ..?
కష్టపడి సాగుచేసిన కూరగాయుల ఎండకు ఎండి చాలా వరకు పాడవుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. కూరగాయలు, ఆకు కూరలు పాడవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి తమ కూరగాయలు అమ్ముతుంటే అక్కడ రైతులు, వ్యాపారుల మధ్య పోటీ అధికంగా ఉండడంతో తమ వ్యాపారం సరిగా సాగడం లేదంటున్నారు. బందరు రోడ్డులో ట్రాఫిక్ అధికంగా ఉంటోందని దీంతో రోజు మొత్తం కూరగాయలు అమ్మడానికి వీలవ్వడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. రోజంతా ఇదే ప్రాంతంలో కూరగాయలు విక్రయిస్తే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని స్థానికులు చెబుతున్నారు.