Balineni Srinivasa Reddy meeting with CM Jagan updates: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మూడు రోజులక్రితం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఊహించని రీతిలో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తాను తప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి పార్టీ పదవి నుంచి తప్పుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఈరోజు పార్టీపై అలకబూనిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని.. పార్టీ అధిష్టానం బుజ్జగించటం ప్రారంభించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సీఎం జగన్ భేటీ అయ్యారు.
భేటీలో భాగంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి పలు కీలక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. ముందుగా రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయటంపై ఆయన ముఖ్యమంత్రికి కారణాలను వివరించారు. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని బాలినేని ఆవేదన చెందారు. దీంతో బాలినేనిని సముదాయించేందుకు సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో రాజీనామాను ఉపసంహరించుకోవాలని బాలినేనిని ముఖ్యమంత్రి జగన్ కోరారు. అయినా కూడా ముఖ్యమంత్రి ఎంతసేపు సముదాయించినా బాలినేని మాత్రం మెత్తబడలేదని సమాచారం. రీజనల్ కోఆర్డినేటర్‌గా కొనసాగేది లేదని బాలినేని సీఎం జగన్‌కు తేల్చి చెప్పారు. సీఎం జగన్‌తో భేటీ ముగిసిన అనంతరం బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాకు కనపడకుండా వెళ్లిపోవటం ఉత్కంఠను రేపుతోంది.
ఇటీవలే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మాజీమంత్రి బాలినేని.. నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, కడప జిల్లాలకు రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలను నిర్వర్తించారు. తాజాగా ఆ పదవికి ఆయన రాజీనామా చేశారు. తనకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రాధాన్యత లేదంటూ కొన్నాళ్లుగా ఆయన అసంతృప్తితో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ పదవికి బాలినేని రాజీనామా చేయడంతో తాడేపల్లి రావాలని ఆయనకు పిలుపువచ్చినప్పటికీ బాలినేని స్పందించలేదు. పార్టీకీ రాజీనామా చేసిన తర్వాత మూడ్రోజులపాటు ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారు.
మరోవైపు శ్రీనివాస్ రెడ్డి.. వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో బాలినేని శ్రీనివాస్ వారిని పట్టించుకోవడం లేదనే విషయాన్ని ప్రస్తానించారు. వీటన్నింటిపైనా ఈరోజు బాలినేనిని ముఖ్యమంత్రి జగన్ వివరణ అడిగినట్లు తెలుస్తోంది. ఆనాటి నుంచి వైసీపీలో ఎంతో కీలకంగా వ్యవహరించిన ముఖ్యనేత అయివటువంటి బాలినేని.. ఇలా పార్టీ పదవుల నుంచి తప్పుకోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో బాలినేని భేటీ కావడం రాష్ట్రంలో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి