Children's Day Special Story : హ్యాపీ చిల్డ్రన్స్‌డే అని మొక్కుబడిగా చెప్పుకోవడం కాదు.. పిల్లలకు నొక్కి చెప్పాల్సిన రోజు నేడు. చాచానెహ్రూ పుట్టినరోజు సందర్భంగా పిల్లలంతా ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పండుగ చిన్నారులకే కాదు తల్లిదండ్రులకు తమబాధ్యతను గుర్తుచేసే రోజు. మరిచిపోలేని గాయాలెన్నో ఆ పసి హృదయాలను వెంటాడుతున్నాయి. వాటికి కళ్లెం వేసి చిన్నారులకు బంగారు భవిష్యత్‌ను అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పరుగులుపెట్టాల్సిన నేటితరం చిన్నారులు నడవడానికే ఇబ్బందిపడుతోంది.
Children's Day Story : ఆ రుగ్మత.. గతంతో పోలిస్తే తీవ్రంగా పెరుగుతోందని దిల్లీలోని ఓ ఆస్పత్రి పరిశోధనలో తేలింది. పోషక విలువలలోపం ఇందుకు ప్రధాన కారణమని నిర్ధరించారు. గతంతో పోలిస్తే జీవన ప్రమాణాలు పెరిగి.. కన్నవాళ్ల ఆదాయం రెట్టింపైంది. ఎక్కడా ఆకలి సమస్యలు లేవు. కానీ ప్రాసెస్డ్ ఆహారానికి బానిసలవుతున్నారు. పిజ్జా బర్గర్ల మోజులోపడిపోతున్నారు. సంప్రదాయ ఆహారాన్ని దూరం పెడుతుండటంతో చిన్నారుల రోగ నిరోధక శక్తి తీవ్రంగా పడిపోతుంది. వాతావరణంలో వచ్చే చిన్నపాటి మార్పుల్ని తట్టుకోలేకపోతున్నారు.
Children's Health Story : జలుబు, జ్వరాలు పెరిగిపోతుండటంతో బడికిడుమ్మా కొట్టేస్తున్నారు. ఆటపాటలకు దూరం అవుతున్నారు. విటమిన్ల లోపం, వాతావరణ పరిస్థితుల వల్ల కేశ సమస్యలు, నేత్ర రుగ్మతలు ఆడపిల్లల్లో పదేళ్లలోనే రుతుస్రావ సమస్యలు, చర్మ వ్యాధులు అధికం అవుతున్నాయి. చిన్నచిన్నవిషయాలకే. కోపంతో ఊగిపోతుడం సహా చిన్నపాటి వైఫల్యానికే మనోధైర్యాన్ని కోల్పోతున్నారు. కన్నవాళ్ల ప్రేమ పరిపూర్ణంగా దక్కకపోవడం, విపరీతమైన ఒత్తిడి, మాధ్యమాల ప్రభావం ఇందుకు కారణమని నిపుణులు భావిస్తున్నారు.
పదీ పన్నెండేళ్ల లోపు పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలకు బీజంపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురు చిన్నారుల్లో ఒకరికి మానసిక సమస్యలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఆడ పిల్లలు, మగపిల్లలు అనే తేడా లేకుండా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇటీవల నేషనల్ క్రైమ్ బ్యూరో వెల్లడించిన నివేదిక ప్రకారం 2021లో 36 వేల 69 మైనర్లు అత్యాచారానికి గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయ. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జరిగిన సంఘటన పసిపిల్లల హృదయాలను కలిచివేసింది.
అలాంటివి ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ప్రతి పరిణామాన్నీ పిల్లలు గమనిస్తూ ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళన పసి మనస్సుల్లో మొదలవకుండా మనమే వారి చుట్టూ ఉన్న సమాజాన్ని భద్రంగా మార్చాలి.గతంలో ఇన్ని చిరుతిళ్లు లేవు. ఇన్ని ఆటవస్తువులు లేవు. సాంకేతికత అందుబాటులో లేకపోయినా ఆ రోజులు పిల్లలకు బంగారురోజులే. కారణం అమ్మానాన్న, సమాజం తమవంతు పాత్రలను సమర్థంగా పోషించడంవల్లే అచ్చమైన బాల్యంలా గడిచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పసితనంప్రశాంతంగా బతికేలా చూడాలి. ఎకోఫ్రెండ్లీ సమాజమే కాదు.
చైల్డ్‌ఫ్రెండ్లీ ప్రపంచంకావాలంటున్నారు నిపుణులు. పిల్లలకు మాట్లాడే అవకాశమివ్వాలని. కనీసం రోజుకు ఓ గంట వారికంటూ సమయం కేటాయించాలి. కలిసి భోజనం చేసి కబుర్లు చెప్పడం సహా సినిమాలు, క్రికెట్, గేమ్స్.. వాళ్లకు నచ్చిన విషయాలపై మాట్లాడాలి. మంచి, చెడులపై మనసు విప్పేంత స్వేచ్ఛఇవ్వాలి. లేత మనసులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఒత్తిడిపెంచే చదువులు, మార్కులు, ర్యాంకులు లక్ష్యాల్ని అర్థంచేసుకోవాలి.కన్నవారిని మించిన మానసిక నిపుణులు లేరని నిరూపించాలి. తల్లిదండ్రుల కలలను చిన్నారులపై రుద్దే ప్రయత్నం చేయవద్దు. బాల్యం నుంచే వాళ్లకు డబ్బు విలువ తెలియజేయాలి.
ఈజీమనీ ఎంత దుర్మార్గమైనదో కథల రూపంలో చెప్పాలి. వాతావరణ మార్పులను తట్టుకునేలా ఎండలో చిన్నారులను తీర్చిదిద్దాలి. తమకంటూ కొన్ని బాల్య అనుభవాలు పోగేసుకునే అవకాశమివ్వాలి. టెక్నాలజీ పిల్లల శత్రువు కాదు, మిత్రుడూ కాదు. అది ఇప్పటి అవసరం మాత్రమేనని చెప్పాలి. సాంకేతిక ప్రపంచాన్ని పరిచయం చేసి గ్యాడ్జెట్స్ లేకుండా బతకలేమనే అలవాటు మాన్పించాలి. వాళ్లేం బ్రౌజ్ చేస్తున్నారో ఓ కన్నేసి ఉంచాలి. ఆటపాటలతోపాటు వారికి నచ్చిన రంగంలో ఎదిగే అవకాశం కల్పించాలి.
నైతిక విలువలతోపాటు ఆరోగ్యకరమైన ఆహారవిధానాన్ని అలవాటు చేయాలి. తగినంత నిద్ర, వ్యాయామం జీవనశైలిలో భాగమయ్యేలా వారి దినచర్యను తీర్చిదిద్దాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే బాల్యంలో మంచిఅలవాట్లు అలవడితే పెద్దాయక మంచి లక్ష్యాలను సాధించగలం. ఆ మాటలన్నది ఎవరో కాదు.. చాచాజీ నెహ్రూ. అందుకే ఆయన మాటలను పాటించడమే కాదూ.. ఆచరించి చూపించాలి.
ఇవీ చదవండి: