Chanaka Korata project: పెన్‌గంగ నదిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చనాకా-కొరాటా ఆనకట్టకు పర్యావరణ అనుమతులు లభించాయి. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు అనుమతులు మంజూరు చేసింది. 2016లో జరిగిన ఒప్పందం ప్రకారం తెలంగాణ, మహారాష్ట్ర సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. తెలంగాణలోని 5463 హెక్టార్లకు, మహారాష్ట్రలోని 1214 హెక్టార్లకు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందనుంది. ఇందుకోసం పెన్‌గంగ నదిపై లోయర్ పెన్ గంగ దిగువన 23 గేట్లతో 0.8 టీఎంసీల సామర్థ్యంతో ఆనకట్ట నిర్మించనున్నారు.
చనాకా-కొరాటా ఆనకట్ట ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 13వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆనకట్ట నుంచి లోయర్ పెన్ గంగ కాల్వలకు.. మరో 47వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, తాంసీ, బేలా మండలాల్లోని యాభై వేల ఎకరాలకుపైగా సాగునీరు అందనుంది. తెలంగాణ రాష్ట్రం వైపు ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన పనులకు... కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదలశాఖకు అధికారికంగా సమాచారం అందించింది.
ఇవీ చదవండి: